BigTV English

Valentines day – vivo mobile: గిఫ్ట్‌గా ఈ ఫోన్ బెస్ట్.. డిస్కౌంట్‌తో తక్కువ ధరకే పొందొచ్చు..

Valentines day – vivo mobile: గిఫ్ట్‌గా ఈ ఫోన్ బెస్ట్.. డిస్కౌంట్‌తో తక్కువ ధరకే పొందొచ్చు..

Valentines day – vivo mobile offer: ప్రేమికుల నెల వచ్చేసింది. ఈ నెల అంతా ప్రేమ జంటలు తమ ప్రేమకు గుర్తుగా గిఫ్ట్‌లను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అయితే తమ ప్రేయసి లేదా ప్రియుడి కోసం మంచి ఫోన్‌ను గిఫ్ల్‌గా ఇవ్వాలని కొందరు చూస్తారు. ఈ క్రమంలోనే పలు బ్రాండెడ్ ఫోన్లను తెగ సెర్చ్ చేసేస్తుంటారు. మంచి ఫీచర్లు, అద్భుతమైన కెమెరాతో పాటు మరిన్ని స్పెసిఫికేషన్స్ కలిగిన ఫోన్లను వెతికేస్తుంటారు. ధర చూసి ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు తక్కువ ధరలో కళ్లుచెదిరే ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. అందులో..


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు మోడల్ సిరీస్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. వాటి సెల్స్ పెంచుకునేందుకు కూడా వినూత్నమైన రీతిలో ఆలోచించి తగ్గింపు ధరలను ప్రకటిస్తుంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన ఓ మోడల్‌పై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

వివో టి2 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో ఈ మొబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.17,999.. రూ.18,999.. రూ.20,999లుగా కంపెనీ నిర్ణయించింది.


అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న ఆఫర్ ప్రకారం.. 4జీబీ వేరియంట్‌ను రూ.17,999కి బదులుగా ఇప్పుడు 33 శాతం తగ్గింపుతో రూ.11,999కే కొనుక్కోవచ్చు. అలాగే 6జీబీ వేరియంట్‌ను రూ.18,999కి బదులుగా 31 శాతం తగ్గింపుతో రూ.12,999కి సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు 8జీబీ వేరియంట్‌ను రూ.20,999కి 28 శాతం డిస్కౌంట్‌తో రూ.14,999కి కొనుగోలు చేసుకోవచ్చు.

అంతేకాకుండా వీటిపై పలు బ్యాంక్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే ఎస్‌బిఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతోపాటు ప్రత్యేక ధర కింద అదనంగా రూ.6వేలు తగ్గింపు లభిస్తుంది. ఇది క్యాష్‌బ్యాక్/ కూపన్‌తో డిస్కౌంట్‌కు కలిపి లభిస్తుంది. ఈ ఆఫర్లన్నింటితో ఈ మొబైల్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ ఫోన్‌పై రూ.9,100 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అయితే పాత ఫోన్ కండీషన్ బట్టి తగ్గింపు నిర్ణయిస్తారు.

ఫీచర్స్:

ఈ స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. 2408 × 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 4జీబీ/6జీబీ/8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌‌తో వచ్చింది. మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఎస్టీ కార్డ్ స్లాట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, GPS, USB టైప్-సి పోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Related News

Smart phones 2025: టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 20 వేల కంటే తక్కువ బడ్జెట్ ఫోన్లు ఇవే..

OnePlus Discount: 6,000mAh బ్యాటరీ, 50 MP కెమెరా.. వన్‌ప్లస్ మిడ్‌రేంజ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Smartphone Comparison: పోకో X7 ప్రో vs ఓప్పో F31 vs రియల్మీ P4 ప్రో.. ఏది బెస్ట్?

Verify Fake iphone: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి

Oppo Phone: 56జిబి స్టోరేజ్, 5జి స్పీడ్.. ఫ్లిప్ మోడల్‌లో కొత్త సెన్సేషన్..

Motorola Mobiles: ఒకే ఫోన్‌లో అన్నీ! ఫాస్ట్ ఛార్జ్ తో వచ్చేసిన మోటరోలా అల్ట్రా బీస్ట్!

Dance Heart Attack: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

Wifi Plans Free OTT: 100Mbps వైఫై.. ఉచితంగా ఓటీటీ.. బెస్ట్ ప్లాన్స్ ఇవే

Big Stories

×