Tecno Phantom Mobiles : Tecno ఫాంటమ్ V ఫోల్డ్ 2, Tecno ఫాంటమ్ V ఫ్లిప్ 2 5G మెుబైల్స్ భారత్ లో లాంఛ్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఈ మెుబైల్ ఫీచర్స్ తో పాటు ధర సైతం లీక్ అయ్యి, స్మార్ట్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. 24GB + 512GB స్టోరేజ్ మోడల్‌తో ఫాంటమ్ V ఫోల్డ్ 2, 16GB+256GB స్టోరేజ్ మోడల్‌తో ఫాంటమ్ V ఫ్లిప్ 2 5G రాబోతున్నాయని టెక్నో సైతం తెలిపింది. ఇక ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి రానున్నాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఫాంటమ్ V ఫోల్డ్ 2 5G, ఫాంటమ్ V ఫ్లిప్ 2 5G మెుబైల్స్ ను భారత్ లో లాంఛ్ చేయబోతోంది. ఇప్పటికే అమెజాన్‌లో ‘కమింగ్ సూన్’ పేజీని విడుదల చేసి… ‘సమ్‌థింగ్ ఎపిక్ ఈజ్ అబౌట్ అన్‌ఫోల్డ్’ అనే క్యాఫ్షన్ తో టెక్నో ప్రియులను ఉర్రూతలూగిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛ్ తేదీలను మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక Tecno Phantom V Fold 2 5G, Tecno Phantom V ఫ్లిప్ 2 5G మెుబైల్స్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంఛ్ అయ్యి యూజర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
Tecno Phantom V Fold 2 Specifications –
టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో పాటు 5750 mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతుంది. ఇక 70W వైర్డు+ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. AI ఇమేజ్ కటౌట్, AI రైటింగ్‌తో Ai మ్యాజిక్ ఎరేజర్‌తో వస్తుంది. ఫాంటమ్ V ఫోల్డ్ 2 16.30cm 3D కర్వ్డ్ ఔటర్ స్క్రీన్, 19.94cm అల్ట్రా ఫ్లాట్ ఫోల్డబుల్ మిర్రర్ స్క్రీన్‌తో రాబోతుంది. టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ 2 కార్స్ట్ గ్రీన్, రిప్లింగ్ బ్లూ కలర్స్ లో రాబోతుంది. గ్లోబల్ మార్కెట్‌లలో Tecno Phantom V Fold 2 5G ధర రూ. 92,200గా ఉంది.
కెమెరా –
కెమెరా విషయానికి వస్తే.. ఇది 1/3 OISతో 50MP ప్రధాన కెమెరాతో అల్ట్రా HD పెంటా లెన్స్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉండనుంది. FOV 115తో 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 2X ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్, 50MP పోర్ట్రెయిట్ కెమెరాతో రాబోతుంది. సెల్ఫీల కోసం ఇందులో డ్యూయల్ 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. డాల్బీ అట్మాస్ స్పీకర్ల సైతం ఉండనున్నాయి.
Tecno Phantom V Flip 2 Specifications –
Tecno Phantom V ఫ్లిప్ 2 మెుబైల్ 70W ఛార్జింగ్‌తో 4720 mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 8 ప్రొటెక్షన్ తో రానుంది. డిస్ ప్లే 9.2cm AMOLED ఓవర్ ఫ్లోయింగ్ స్క్రీన్, 17.5cm ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉండనుంది. Tecno ఫాంటమ్ V ఫ్లిప్‌లో 16GB RAM + 256GB ROM ఉండనున్నాయి. 50MP OI, 50MP UWతో డ్యూయల్ కెమెరాతో రాబోతుంది. ఇక ఈ మెుబైల్ లో సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఫాంటమ్ V ఫ్లిప్ 2 మూన్‌డస్ట్ గ్రే, ట్రావెర్టైన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో రానుంది. Phantom V Flip 2 5G ధర రూ. 58,600గా ఉంది.
ALSO READ : ఫోన్ ఛార్జింగ్ తీస్తూ కుప్పకూలిన యవతి.. అసలు ఏం జరిగిందంటే!