Big Stories

Vivo X Fold 3 Price & features: వివో నుంచి మడత ఫోన్ వచ్చేస్తోంది.. దీని ధర ఎంతంటే..?

Vivo X Fold 3
Vivo X Fold 3

Vivo X Fold 3 Price & Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో Vivo X ఫోల్డ్ 3 సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉన్నాయి. Vivo x fold 3 మరియు Vivo x fold 3 Pro. ఇప్పుడు దీని బేస్ వేరియంట్ భారతదేశంలో త్వరలో తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక ఆలస్యం చేయకుండా ఫోన్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Vivo X Fold 3 ఫీచర్లు..

- Advertisement -

Vivo X Fold 3లో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ఉంటుంది. ఇది 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5,500mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో 8.03 ఇంచెస్ 2K ప్రైమరీ డిస్‌ప్లే ఉంది. అలానే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ను త్వరలో భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు.

Also Read: కిర్రాక్ ఆఫర్.. రూ.82 వేల ల్యాప్‌టాప్ సగం ధరకే!

Vivo X ఫోల్డ్ 3 ధర..

Vivo X ఫోల్డ్ 3 మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని 12GB + 256GB ధర సుమారు రూ. 80,000.అయితే 16GB + 256GB వేరియంట్ ధర రూ. 87,800. దాని టాప్ వేరియంట్ 16GB + 512GB ధర రూ. 93,600గా ఉంది.Vivo X ఫోల్డ్ 3 చైనాలో రెండు కలర్స్ వేరియంట్లలో రిలీజ్ చేస్తుంది. ఫెదర్ వైట్ మరియు థిన్ వింగ్ బ్లాక్. భారత్‌లో కూడా ఇవే ఫీచర్లు, ధరలు ఉండనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Vivo X ఫోల్డ్ 3 ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 16GB వరకు LPDDR5X RAM మరియు UFS4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 1TB వరకు ఉంటుంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది.ఇందులో 50MP VCS బయోనిక్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 50MP పోర్ట్రెయిట్ షూటర్ ఉన్నాయి. డిస్‌ప్లే పై రెండు 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను అమర్చారు.

Also Read: శ్యామ్‌సంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్

Vivo X ఫోల్డ్ 3 మొబైల్ ఇండస్ట్రీలో అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ అవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ ఫోన్‌‌ను మడత పెట్టినా కూడా 10.2 మిమీ మందంగా ఉంటుంది. భారత్‌ మొబైల్ లవర్స్ ఈ ఫోన్‌ ఎంతగానో ఆకట్టుకుంటోందని వివో భావిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News