BigTV English

Daniel Balaji: పదేళ్లుగా ఆశపడ్డ.. చివరి కోరిక తీరకుండానే కన్ను మూసిన డేనియల్ బాలాజీ

Daniel Balaji: పదేళ్లుగా ఆశపడ్డ.. చివరి కోరిక తీరకుండానే కన్ను మూసిన డేనియల్ బాలాజీ

Daniel BalajiDaniel Balaji: ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ (48) వయస్సులో శుక్రవారం గుండెపోటుతో కన్నుముసిన విషయం తెలిసింది. అయితే తెర వెనకు చేసే దాన దర్మాల గురించ పెద్దగా బయటకు తెలియనివ్వరు. కొందరు మాత్రం కొంత మొత్తంలో దానం చేసిన కోట్లు దానం చేసినట్లు చెప్పుకుంటారు. కానీ డేనియల్ మాత్రం ఎవరికి ఎంత పెద్ద సాయం చేసినా సరే పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి గొప్ప హృదయం ఉన్న వ్యక్తి గుండెపోటుతో తుదిశ్వాస విడవడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాయం నెలకొంది.


పలు సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన డేనియల్.. నిజ జీవితంలో మాత్రం హీరోగానే బతికారు. చిట్టి అనే సీరియల్ తో డేనియన్ నటప్రస్థానం మొదలైంది. అలా డేనియల్ తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోని అనేక చిత్రాల్లో కీలక పాత్రలో పోషించే స్థాయికి ఎదిగారు. తనకుంటూ ఆస్తిని మాత్రం పెద్దగా దాచిపెట్టుకోలేదు. తన దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం వరకు గుడి కట్టడానికే ఉపయోగించారు.

అయితే డేనియల్ బాలాజీ ఏం కావాలని ఇండస్ట్రీకి వచ్చారో ఆ కోరిక మాత్రం తీరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయనకు డైరెక్షన్ అంటే ఇష్టం. స్క్రీన్ పై విజనిజం పండించే ఆయన ఎప్పుడూ తనకు ఓ కోరిక ఉందనే వారు. 2014లో తమిళంలో ఓ సినిమా తీసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా తీయడం కుదరలేదు.


Also Read: Sundeep Kishan: మరొక హిట్ కోసం సందీప్ కిషన్.. కొత్త సినిమా షురూ చేసేశాడుగా..

తాను ఓ సినిమా చేయాలనుకుంటున్నానని ఆయన ఇటీవలే ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ రెడీ అయ్యిందని.. తానే ఆ సినిమాను డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ సినిమాలో తాను కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తానని తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ భాషల్లో ఓకేసారి నిర్మించాలని.. దీనికి తన స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహిస్తారని పేర్కొన్నారు. ఎందుకోగానీ అన్ని సిద్ధం అయినా సరే ఆయన కలలుగన్న ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చకుండానే డేనియల్ కన్నుమూశారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×