Big Stories

Flipkart Sale : కిర్రాక్ ఆఫర్.. రూ.82 వేల ల్యాప్‌టాప్ సగం ధరకే!

Flipkart Sale
Flipkart Sale

Flipkart Sale : ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడైతే ల్యాప్‌టాప్ అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు అలా లేదు ట్రెండ్ మారింది. చెడ్డీలు వెసుకునే చిన్నోళ్ల నుంచి ఇంట్లో ఉండే ముసలవ్వ వరకు ల్యాప్‌టాప్‌లను ఈజీగా ఉపయోగిస్తున్నారు. ఇప్పడు ఉన్న టెక్నాలజీ, డిజిటిల్ చదువులు వల్ల ల్యాప్‌టాప్ అవసరంగా మారింది. ఇక ఎంప్లాయిస్, బిజినెస్‌లు చేసే వారైతే వీటని వీపున తగిలించుకునే తిటరుగుతూనే ఉంటారు.

- Advertisement -

అయితే మంచి ల్యాప్‌టాప్ కొనాలంటే ఎక్కవ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రూ.40 వేల లోపు బడ్జెట్‌లో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్ టాప్ దొరకడం కాస్త కష్టమైనే చెప్పాలి. అయితే మీకు శ్యామ్‌సంగ్ బ్రాండ్ నచ్చినట్లయితే ఇదే బడ్జెట్‌లో ఈ స్పెసిఫికేషన్‌తో ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. అది చూసేద్దాం రండి.

- Advertisement -

Also Read : శ్యామ్‌సంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్

దేశంలో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఫ్లిప్‌కార్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ బుక్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 82,990 ఉండగా 48 శాతం ప్రైస్ తగ్గించింది. అంటే ల్యాప్‌టాప్ రూ.42,9990కే కొనుగోలు చేయవచ్చు. అంతకాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ. ఎక్స్‌ట్రాగా రూ.5000 తగ్గుతుంది. అలానే బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ల్యాప్‌టాప్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది ఇంటెల్ బ్రాండిగ్‌పై వస్తుంది. Intel Core i5, 12th జెనరేషన్, 1235U ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ 1.3GHz up to 4.4GHz‌గా ఉంది.
Intel Integrated UHD గ్రాఫిక్ కార్ట్ ఉంటుంది. విన్‌డోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఎమ్‌ఎస్ ఆఫీస్ సిస్టమ్‌తో పాటుగా లభిస్తుంది.

Also Read : ఐపీఎల్.. ఈ ప్లాన్స్‌‌తో వాడుకున్నోలకి వాడుకున్నంత 5జీ డేటా!

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే యాంటీగ్లేర్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌తో 6 గంటల వరకు ఉపయోగించవచ్చు. టచ్ స్క్రీన్ సపోర్ట్ లేదు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వీటితో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ ఉన్నాయి. వెబ్ కెమెరా కూడా ఉంది. కంపెనీ ఏడాదిపాటు వారెంటీ కూడా ఇస్తుంది. దీన్ని శ్యామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News