Yuzvendra Chahal On 2019 World Cup semifinal: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో భారత జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని.. ఎన్నో ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఎన్నో ట్రోఫీలను టీమిండియా కు ( Team India) అందించి చరిత్ర సృష్టించాడు ధోని (Dhoni). అలాంటి మహేంద్ర సింగ్ ధోని డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు మాజీ క్రికెటర్ యుజ్వేంద్ర చాహాల్ (Yuzvendra Chahal) కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోయినందుకు గాను ధోని డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి వెక్కివెక్కి ఏడ్చాడని బాంబు పేల్చారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో యుజ్వేంద్ర చాహల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 వన్డే వరల్డ్ కప్ (2019 World Cup semifinal) గురించి కీలక విషయాలను పంచుకున్నారు.
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా సెమీఫైనల్ దాకా వెళ్లిన టీమిండియా ఇంటిదారి పట్టింది. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి సంఘటనను తాజాగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గుర్తు చేశారు. ఓ పాడ్ కాస్ట్ లో ఈ సంఘటన గురించి ప్రస్తావన రాగా… చాహల్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిపారు.
డ్రెస్సింగ్ రూమ్ లో ధోని వెక్కి,వెక్కి ఏడవడం తాను కల్లారా చూసానని వివరించారు. ఆ సమయంలో తనకు కూడా బాధ వేసిందని తెలిపారు. ఎప్పుడు కూల్ గా ఉండే మహేంద్రసింగ్ ధోని.. ఆ ఒక్క సంఘటన కారణంగా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ప్లేయర్లు కూడా షాక్ అయినట్లు వెల్లడించారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ మొత్తం వేరే లోకానికి వెళ్లిందన్నారు. టీమిండియా క్రికెట్లో అదో చీకటి రోజు అని పేర్కొన్నారు. ధోనిలో కూడా సెంటిమెంట్ ఫెలో ఉన్నాడని వివరించారు. దీంతో ధోనిపై చాహల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2019 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇందులో 18 పరుగులు తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఛేజింగ్ సమయంలో మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. గుప్టిల్ రన్ అవుట్ చేసిన నేపథ్యంలో టీం మీడియా ఓటమిపాలైంది. దీంతో వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ పోయింది. అందుకే ధోని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం