Taliban drivers: తాలిబన్లు అంటే మనకు తుపాకులు పట్టుకోవడం, హింసాత్మక ఘటనలు మాత్రమే గుర్తుకు వస్తాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైంది. అప్పటి నుంచి ఆ దేశంలో వారి పాలన నడుస్తోంది. అయితే.. మిలిటెంట్ గ్రూప్ పాలనలో ప్రజల ఎలా ఉంటారో అని అందరూ అనుకున్నారు. కానీ, కొన్ని అక్కడక్కడ నిరసనలు తప్ప పెద్దగా ఆందోళనలు కనిపించినట్టు వార్తలు రాలేదు.
ఎండలకు తట్టుకోలేక పోతున్న ప్రజలు
అయితే.. అక్కడ వాతావరణం పరంగా కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. చలి ఎంతగా ఉంటుందో ఎండలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండలను తట్టుకోలేక పోతున్నారు అక్కడి జనం. ఈ సమయంలోనే అప్ఘాన్ డ్రైవర్లు భిన్నమైన ఆలోచన చేస్తున్నారు. ఇది ఏసీని మించి ప్రయోగం అని చెబుతున్నారు.
రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
అప్ఘాన్ లో రోడ్లు అంతంతమాత్రమే ఉన్నాయి. ఈ రోడ్లపై వాహనాలు నడపడం అంటే మాములు ముచ్చట కాదు. దానికి తోడు గరిష్ఠ స్థాయిలో ఎండలు కొడుతున్నాయి. దీంతో అప్ఘాన్‌లోని కాందహార్ నగర ట్యాక్సీ డ్రైవర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్న ఎండలకు కార్లలోని ఏసీలు సరిగా పనిచేయడం లేదు.
కార్లకు కూలరు బిగించి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు
దీంతో క్యాబ్ డ్రైవర్ల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కార్లకు కూలర్లు బిగిస్తున్నారు. తమ వాహనాలపై వెడల్పైన గొట్టాలు, ఎగ్జాస్ట్ ట్యూబ్ లు బిగించారు. కారుపైన కూలర్ పెట్టి.. దానికి బిగించిన గొట్టాన్ని కారులోకి పెట్టి టేప్ చేస్తున్నారు. ఈ కొత్త ఏర్పాటు ఏసీ కంటే బాగా ఉందని చెబుతున్నారు. ఏసీతో కారు ముందుభాగమే కూల్ అవుతుందని.. కూలర్లతో మొత్తం చల్లగా అవుతుందని చెబుతున్నారు.
Also Read: పెద్దారెడ్డి కోడలు ఎంట్రీ.. తాడిపత్రిలో సీన్ రివర్స్
రోజుకు రెండు సార్లు నీళ్లు పోస్తే సరిపోతుందని వెల్లడి
కూలర్ నుంచి గాలి చల్లగా రావాలంటే రోజుకు రెండు సార్లు నీళ్లు నింపాలని డ్రైవర్లు చెబుతున్నారు. అఫ్ఘాన్ లో మిగతా దేశాల లాగాప్రకృతి సంరక్షణ, మొక్కల పెంపకం ఉంటుందని భావించలేం. ఎందుకంటే దశాబ్దాలుగా యుద్ధాలతో ఆ దేశం అతలాకుతలం అయింది. పైగా రష్యా, అమెరికాలు ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. దీంతో కటిక పేదరికంలో మగ్గుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఎదుర్కొంటోంది. మున్ముందు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో అఫ్ఘాన్‌లో ఎండలు అల్లాడించాయి.