Vivo X200 vs iQOO 13 vs OnePlus 13 : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో.. ఎక్స్200 (Vivo X200) సిరీస్ మొబైల్స్‌ను భారత్‌లో లాంఛ్ చేసింది. వివో ఎక్స్200 (Vivo X200), వివో ఎక్స్200 ప్రో (X200 Pro) పేరిట వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు మంచి కెమెరాతో దీన్ని విడుదల చేసింది. X200 Pro ధర రూ.94,999 ఉండగా, X200 వచ్చేసరికి రూ.65,999గా ఉంది. అయితే ఇదే ధరకు రీసెంట్గా లాంఛ్ అయిన ఐక్యూ 13, అలానే త్వరలోనే రానున్న వన్‌ప్లస్ 13 కూడా మంచి కెమెరా స్పెసిఫికేషన్స్ సహా ఇతర ఫీచర్స్‌తో డిజైన్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలను తెలుసుకుందాం.
Vivo X200 vs iQOO 13 vs OnePlus 13 ధరల వివరాలు –
Vivo X200 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.65,999గా, 16జీబీ +512జీబీ వేరియంట్ ధర రూ.71,999గా కంపెనీ నిర్ణయించింది.
iQOO 13 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.₹54,999 గా, 16జీబీ +512జీబీ వేరియంట్ ధర రూ.₹54,999 గా కంపెనీ నిర్ణయించింది.
వన్‌ప్లస్ 13 జనవరి 2025లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దీని ధర గురించి స్పష్టత లేదు. అయితే 2024 జనవరిలో విడుదలైన వన్ ప్లస్ 12 రూ.64,999గా ఉంది. దాదాపు వన్ ప్లస్ 13 కూడా ఇదే ధరతో వస్తుందని అంచనా. స్పాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తుందని సమాచారం.
Vivo X200 vs iQOO 13 vs OnePlus 13 స్పెసిఫికేషన్స్
Vivo X200 స్పెసిఫికేషన్స్
వివో ఎక్స్200 (Vivo X200) 6.67 అంగుళాల మైక్రో క్వాడ్ కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లేతో వచ్చింది. 1600నిట్స్ హెచ్‌బీఎం, ఇందులో 120Hz రిఫ్రెష్ రేటు ఇచ్చారు. మీడియా టెక్ డైమెన్సిటీ 9400తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15తో కూడిన ఫన్‌టచ్ ఓఎస్15తో ఈ ఫోన్ నడుస్తుంది. 5,800mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. 50ఎంపీ సోనీ IMX921 ఓఐఎస్‌తో కూడిన ప్రధాన కెమెరాతో పాటు 50ఎంపీ శాంసంగ్ JN1 అల్ట్రా వైల్డ్, 50ఎంపీ LYT600 3ఎక్స్ పెరిస్కోపిక్ రియర్ కెమెరాలు ఇచ్చారు. సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా అమర్చారు. వైఫై 7,6,5, డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నాలుగేళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ ఇవ్వనున్నారు.
iQOO 13 స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 6.82 అంగుళాల 2కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 144 Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో.. గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచేందుకు ఐకూ క్యూ2 చిప్‌ను అమర్చారు. అడ్రినో 830 జీపీయూను అమర్చారు. హీట్‌ని కంట్రోల్ చేయడానికి 7,000 sq mm వ్యాపర్ ఛాంబర్‌ను ఇచ్చారు. వెనకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సర్ ఆప్టికల్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. దీంతోపాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, 50 ఎంపీ టెలీ ఫొటోలెన్స్ అమర్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌ను కలిగి ఉంది.
OnePlus 13 specifications :
వన్‌ప్లస్ 13 పేరుతో విడుదలైన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే విడుదలైంది. త్వరలోనే ఇండియాలో వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.82 BOE X2 2K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్తో వస్తోంది. కెమెకా విషయానికొస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు మొత్తం మూడు కెమెరాలు ఇచ్చారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ 32 ఎంపీ కెమెరాను అమర్చారు. ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
OnePlus 13 VS iQOO 13 VS Vivo X200 ఏదీ బెస్ట్?
మొత్తంగా ఈ మూడింటిలో దాదాపుగా సేమ్ ఫీచర్స్ ఉన్నప్పటికీ iQOO 13 చీపెస్ట్ స్మార్ట్ ఫోన్. కాకపోతే iQOO 13కు వన్‌ప్లస్ 13, వివో X200 తరహాలో హెస్సెల్బ్లాడ్ లేదా జీసెస్ బ్రాండింగ్ కెమెరా లెన్స్ లేవు. అలానే ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే కారణంగా వివోX200 కాస్త వెనకపడిందనే చెప్పాలి. ఎందుకంటే OnePlus 13, iQOO 13 8టీ ఎల్‌టీపీఓ ప్యానెల్‌ను కలిగి ఉన్నాయి. ఇంకా మిగతా రెండింటితో పోలిస్తే వన్ ప్లస్ 13కు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. దీనికి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ALSO READ : సామ్ సాంగ్ ప్రియులకు డబుల్ ధమాకా.. ఒకేసారి రెండు సిరీస్ లాంఛ్