Samsung Galaxy S26 : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్.. ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25, S26 సిరీస్ రానున్నాయి. అలానే గెలాక్సీ S25 అల్ట్రా కూడా రానుంది. ఈ మోడల్స్ ఏ ప్రాసెసర్‌తో రానున్నాయి, ఇతర ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్ నుంచి నెక్ట్స్ గెలాక్సీ S25 సిరీస్‌ను విడుదల కానుంది. ఈ S25 సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే చాలా లీక్స్ బయటకు వస్తున్నాయి. టెక్ వర్గాల రిపోర్ట్ ప్రకారం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCతో ఇది గ్లోబల్ మార్కెట్లో విడుదల కానుంది.
అయితే దీంతో పాటే గెలాక్సీ S26 సిరీస్ కూడా విడుదల చేయనుంది శాంసంగ్. దీని కోసం ఇన్ హౌస్ Exynos చిప్సెట్ మళ్లీ తీసుకురానుందట. Exynos 2500 చిప్సెట్ 3nmతో రానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ను 2026 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు ఉంటున్నాయి.
వాస్తవానికి ఇన్ హౌస్ Exynos చిప్‌సెట్‌ను సెలెక్ట్‌డ్ మోడల్స్ కోసం మళ్లీ రీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది శాంసంగ్. అలా గెలాక్సీ S25 సిరీస్ కోసం Exynos 2500 చిప్సెట్ తీసుకురావాలనుకుంది శాంసంగ్. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో ఈ గెలాక్సీ S25 సిరీస్‌ను విడుదల చేయనుంది.
ఒకవేళ బయటకు వచ్చిన రిపోర్ట్స్ నిజమైతే, 2026లో రాబోయే S26 సిరీస్ కోసం.. S24 సిరీస్ తరహాలోనే Exynos-Snapdragon స్ప్లిట్ స్ట్రాటజీను శాంసంగ్ ప్రవేశపెట్టవచ్చు. ఆసియా, యూరోప్, మిడిల్ ఈస్ట్‌లో ఇన్‌హౌస్ చిప్సెట్… యునైటెడ్ స్టేట్స్లో స్పాడ్డ్రాగన్ Socని ఆఫర్ చేయొచ్చు.
Samsung Galaxy S25 మెుబైల్ Snapdragon 8 Elite SoC చిప్ సెట్ తో రాబోతుంది. ఆ తర్వాత రాబోతున్న Samsung Galaxy S26 series లో మళ్లీ Exynos chipsetsను రీ ఇంట్రడ్యూస్ చేస్తోంది. Galaxy S25 Ultra మంచి కెమెరాతో రానుంది.
ఇంకా గెలాక్సీ S25 అల్ట్రాను కూడా లాంఛ్ చేయనుంది శాంసంగ్. అయితే ఈ మోడల్ మంచి కెమెరా అప్‌గ్రేడ్స్‌తో రానుంది. 50 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌ను ఇది కలిగి ఉండనుందని తెలిసింది. గెలాక్సీ S24తో పోలిస్తే ఇది ఎక్కువ. ఇంకా 200 మెగా పిక్సల్ ప్రైమరీ షూటర్, టెలిఫొటో లెన్స్ కూడా ఇవ్వనుందట. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
ఈ మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్న సాంసంగ్ అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదిరే కెమెరా ఫీచర్స్ తో పాటు చిప్ సెట్, ప్రాసెసర్, డిస్ ప్లే ఫీచర్స్ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక వీటికి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వచ్చే ఏడాది రాబోతున్న ఈ మొబైల్స్ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AlSO READ : సామ్ సాంగ్ కొత్త ల్యాప్టాప్ భయ్యా.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!