E-Paper
Advertisement

బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..

బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..
Advertisement

Badvel School: చదువుల గుడిగా భావించే పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేగడం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక శ్రీ విద్య ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా క్షుద్ర పూజలు నిర్వహిస్తోందన్న వార్త విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసింది.

ఆఫీస్ గదిలో తవ్వకాలు.. అర్ధరాత్రి పూజలు

Advertisement

పాఠశాల ఆఫీస్ గదిలో ఏకంగా 12 అడుగుల లోతు గుంత తవ్వి, అందులో నిమ్మకాయలు, యంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. గత 20 రోజులుగా ఓ సాధువు ప్రతిరోజూ అర్ధరాత్రి వేళ పాఠశాలకు వచ్చి ఈ తంత్రాలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పిల్లలు చదువుకునే చోట ఇలాంటి మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు నిర్వహించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన.. చర్యలకు డిమాండ్

Advertisement

విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ యాజమాన్య తీరుపై మండిపడ్డారు. పాఠశాలలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!

Tags

Related News

రూ.7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ!

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

అక్వాన్ తుఫాన్ తీరం దాటిందో‌చ్.. ఏపీకి పెద్ద గండం తప్పింది, కుమ్మేస్తున్న భారీ వర్షాలు

‘బిగ్‌ టీవీ’ ముందే చెప్పింది.. జెడ్పీ పీఠాలపై లిస్టు ఇదిగో, ఎవరు ఎక్కడెక్కడంటే..

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!

బీటెక్ రవి ధర్నాపై.. ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు!

Big Stories

Advertisement
×