MeToo Wave.. Malayalam Actress Sowmya “Groomed Me As Sex Slave” Charge Against Tamil Director: మలయాళ సినీ పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ నివేదిక తర్వాత ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఆ కుదుపుతో అక్కడ హేమాహేమీల ఆధ్వర్యంలో నడుస్తున్న అమ్మా అసోసియేషన్ సభ్యులంతా రాజీనామాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది సీనియర్ నటుడు మోహన్ లాల్ కూడా తమ అసోసియేషన్ పెద్దలపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే ఇది అక్కడితో ఆగిపోలేదు. పొరుగునే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కమిటీ వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. విశాల్ తో సహా రాధిక, కుష్బూ వంటి తారలు ఈ విషయంపై పట్టుబడుతున్నారు. ఇక బుల్లితెర లోనూ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ధైర్యంగా స్పందించారు కుట్టి పద్మిని. పలు టీవీ సీరియల్స్ నిర్మాతగా కుట్టి పద్మిని పాపులర్. బాలనటిగా పలు తమిళ, తెలుగు సినిమాలలో నటించారు. ఇక రాజకీయ రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ పై కేరళ కాంగ్రెస్ నాయకురాలు సిమి రోజ్ బెల్ జాన్ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం సౌత్ అంతటా ఈ విషయంపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
తండ్రిగా భావించా..
రీసెంట్ గా ఒకప్పటి మలయాళ నటి సౌమ్య ఓ తమిళ దర్శకుడు తనని సెక్స్ బానిసగా ఉపయోగించుకున్నాడని ఆరోపించడంతో తమిళ ఇండస్ట్రీలో నూ క్యాస్టింగ్ కౌచ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తొంభైవ దశకంలో మలయాళ నటి సౌమ్య అప్పుడే గుర్తింపు పొందారు. అయితే ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా..అసలు సినీ పరిశ్రమ గురించి అవగాహన లేని వయసులో సినిమాలలో ఎంట్రీ ఇచ్చారు సౌమ్య. అప్పటికి ఆమెకు 18 సంవత్సరాలట. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తమిళ దర్శకుడు అప్పటికే తమిళ సనీ రంగంలో పాపులర్. తనకు తెలిసీ తెలియని 18 ఏళ్ల వయసులో ఆ తమిళ దర్శకుడు తన భార్యతో కలిసి తన వద్దకు వచ్చారని సౌమ్య తెలిపారు. తనని తండ్రిగా భావించమని సౌమ్యకి చెప్పాడు. మొదట్లో ఆయన పట్ల చాలా గౌరవం ఉండేదని..నిజంగానే తండ్రి లాగానే తాను భావించానని అన్నారు సౌమ్య. అయితే మొల్లిగా ఆ దర్శకుని నైజం బయటపడిందని అన్నారు.
మత్తు ఇచ్చి లోబరుచుకుని..
తన భార్యకు పిల్లలు లేరని..తనతో కలిసి పిల్లలను కనాలని అనుకుంటున్నానని ఆ దర్శకుడు చెప్పడంతో షాకింగ్ కు గురయ్యానని అన్నారు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సార్లు లైంగికంగా తనని లోబరుచుకోవాలని చూశాడని అన్నారు. ఒక సారి ముద్దు కూడా పెట్టాడని..తన ప్రమేయం లేకుండా తనికి మత్తు మందు ఇచ్చి చాలా సార్లు లోబరుచుకున్నారని సౌమ్య తెలిపింది. విషయం ఎవరికైనా చెబితే తనకి సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని అనడంతో అలాగే సంవత్సర కాలం ఆ దర్శకుడిని భరించానని అన్నారు. తనని సెక్స్ బానిసగా వాడుకున్న ఆ దర్శకుడి పేరు మాత్రం సౌమ్య బయటపెట్టలేదు. ఎప్పటినుంచో తన హృదయంలో దావానలంలా రగిల్చివేస్తున్న ఆ అవమానాన్ని ముప్పై సంవత్సరాల పాటు భరించానని అన్నారు. అందుకే హేమ కమిటీ వచ్చాక ధైర్యం వచ్చిందని..చెప్పుకొచ్చారు. ఇంకా ఇండస్ట్రీలో తనలాంటి వారు ఎందరో ఉన్నారని..వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. పనిచేసే చోట గౌరవం ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుందని..కానీ పురుషాధిక్య సినీ ఇండస్ట్రీలో తరతరాలుగా మహిళలకు అన్యాయం జరుగుతునే ఉందని సౌమ్య వాపోయారు.