BigTV English

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో  ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్ హ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. 8 రోజుల మిషన్ కోసం జూన్ 5న స్పేస్ లోకి వెళ్లిన ఆమె ఇప్పటికీ భూమ్మీదకు తిరిగిరాలేదు. బ్యారీ విల్ మోరీతో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాప్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీతా జూన్ 14న భూమ్మీదికి రావాలి. కానీ, వాళ్లు స్పేస్ లోకి వెళ్లిన అంతరిక్ష నౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అక్కడి ఉండిపోయారు.  సునీతా విలియమ్స్ మాత్రమే కాదు, అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న జీవులకు ఏమైందో చూద్దాం..


1947లో స్పేస్ లోకి ఈగలను పంపిన పరిశోధకులు

మనుషులు స్పేస్ లోకి అడుగు పెట్టక ముందు కొన్ని జీవులను అంతరిక్షంలోకి పంపించారు శాస్త్రవేత్తలు. పండు ఈగలు, కోతులు, చింపాంజీలు, కుక్కలను పంపించారు. మనుషులు అంతరిక్షంలో ప్రాణాలతో ఉండగలరా? లేదా? అని పరిశోధన చేశారు. 1947లో పండు ఈగలను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా పరిశోధకులు నోజీ V2 స్పేస్ క్రాఫ్ట్ లో వీటిని పంపించారు. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. ఈగలు మళ్లీ తిరిగి భూమ్మీదకు వచ్చాయి. వీటి జెనెటిక్స్ లో కొన్ని మార్పులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 1949లో ఆల్బర్ట్ 2 అనే మంకీని నాసాకు చెందిన V-2 సౌండింగ్ రాకెట్‌ పంపించారు. పారాచూట్ ఫెయిల్యూర్ తో ఆల్బర్ట్ 2 ల్యాండింగ్‌లో టైమ్ లో చనిపోయింది.  1957లో 3 ఏండ్ల లైకా అనే కుక్కను రష్యా పరిశోధకులు స్పేస్ లోకి పంపించారు. స్పేస్ లోకి వెళ్లే సమయంలో క్యాప్సూల్ లో హీట్ పెరిగి చనిపోయింది. అయినప్పటికీ కొద్ది రోజుల పాటు దాని డెడ్ బాడీ స్పేస్ లో తిరిగి భూమ్మీదకు చేరుకుంది.1960లో రష్యా అంతరిక్షంలోకి రెండు కుక్కలను పంపించింది. ఇవి భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా భూమ్మీదకు వచ్చాయి. మనుషులు స్పేస్ లోకి వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావించారు. 1961లో హామ్ అనే చింపాంజీని NASA అంరిక్షంలోకి  పంపింది. ఇది కూడా సురక్షితంగా తిరిగి వచ్చింది. 1963లో  ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ ఓ పిల్లిని పంపించింది. స్పేస్ లోకి వెళ్లినప్పుడు దాని మెదడులో వచ్చే మార్పులను తెలుసుకొనేందుకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. ఆ తర్వాత ఈ పిల్లి సురక్షితంగా భూమ్మీదకు వచ్చింది. ఈ పిల్లి మెదడులో రికార్డయిన విషయాలు తెలుసుకొనేందుకు దాని బ్రెయిన్ పై ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత చేపలు, సాలీడు, తాబేళ్లను కూడా స్పేస్ లోకి పంపించారు.


తొలిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టిన యూరి గగారిన్

1961లో రష్యన్ ఆస్ట్రోనాట్ యూరి గగారిన్ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లారు. 27 ఏళ్ల ఆయన సోవియట్ స్పేస్ క్యాప్సూల్‌ లో భూమి చుట్టూ తిరిగారు. సురక్షితంగా భూమ్మీదకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికారు.

ఎక్కువ రోజులు స్పేస్ ఉంటే ఏమవుతుందంటే?

ఆస్ట్రోనాట్స్ ఎక్కువ కాలం స్పేస్ లో ఉంటే కండరాలు, ఎముకల బలహీనతతో పాటు చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కళ్లు,గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. రేడియేషన్ కారణంగా హ్యోమగాముల డీఎన్ఏలో సమస్యలు ఏర్పడుతున్నట్లు తేలింది. రక్త సంబంధ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ రోజూ రెండు గంటల పాటు వర్కౌట్స్ చేస్తారు.

Read Also: తగ్గేదేలేదంటున్న టెస్లా.. ఎలక్ట్రానిక్ రంగంలో మరో ముందడుగు.. రోబో వ్యాన్, రోబో టాక్సీ లాంఛ్

Related News

Nano Banana Photo: ఘిబ్లీ మరిచిపోండి ఇప్పుడు ఇదే ట్రెండ్.. 3డీ ఫొటోలతో పిచ్చెకిస్తున్న నానో బనానా ఏఐ..

iPhone Air Comparison: ఐఫోన్ ఎయిర్ vs గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్ షిప్ ఫొన్ బెస్ట్?

Old Iphones Discontinue: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఆపిల్ షాకింగ్ నిర్ణయం.. పాత ఐఫోన్‌ల విక్రయాలు బంద్!

Pixel 9 Discount: గూగుల్ పిక్సెల్ 9 పై సూపర్ డీల్.. 50 శాతానికి పైగా తగ్గింపు..

iPhone 17 Pro Max: ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కు పోటీనిచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు..

iPhone 16 vs iPhone 17: ఐఫోన్ 16 లేదా ఐఫోన్ 17.. భారతీయులకు ఏది బెటర్?

Best Selling iPhone: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే.. తాజా రిపోర్ట్‌‌లో షాకింగ్ విషయాలు!

Iphone Air : వచ్చేసింది ఐఫోన్ ఎయిర్.. గెలాక్సీ S25 ఎడ్జ్‌కు సవాల్ విసిరిన ఆపిల్

Big Stories

×