Kondareddy Palli : సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగను పురస్కరించుకుని తొలిసారిగా కొండారెడ్డిపల్లిలో అడుగుపెట్టారు. అయితే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన సీఎం స్వగ్రామంలో మాస్ ఎంట్రీ ఇచ్చారు. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ. దీంతో ఆయన దసరా సందర్భంగా స్వగ్రామానికి చేరుకున్నారు.
ఏటా దసరా పండక్కి తన సొంత ఊరిలో జరిగే వేడుకలకు హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సీఎం హోదాలో తన సొంత ఊరికి హెలికాప్టర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. సీఎం ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల్లో పూనకాలు వచ్చేశాయి. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
సీఎం హెలికాఫ్టర్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. సొంతురూలో హెలికాప్టర్ మాస్ ఎంట్రీ మాములుగా లేదని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో దాదాపుగా రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
Also Read : కొండారెడ్డిపల్లికి మహర్ధశ… మోడల్ విలేజ్’గా సీఎం స్వగ్రామం