Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఏడాది మొత్తం ఇదే పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే వచ్చింది. ఈ మధ్య బన్నీ కూడా రామ్ గోపాల్ వర్మలా వివాదాలను కొనితెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు మెగాస్టార్ లేనిదే నేను లేను అన్న బన్నీ.. ఇప్పుడు ఫ్యాన్స్ లేనిదే నేను లేను మాట తిప్పాడు. ఒకప్పుడు పవన్ బాబాయ్ అన్న బన్నీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. ఇలా మెగాఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి ఒక ఐకానిక్ బ్రాండ్ గా ఎదిగాడు.
ఇక ఈ ఏడాది ఎలక్షన్స్ మొత్తాన్ని తారుమారు చేసే సంఘటన నంద్యాలలో జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేనను కాదని.. వైసీపీ నేతకు సపోర్ట్ గా అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. అసలు అక్కడే మొదలయ్యింది గొడవ అంతా.. సొంత ఇంటికే సున్నం పెట్టడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది. ఫ్రెండ్ కోసం వెళ్లాను అని బన్నీ కవర్ చేసినా.. మెగా ఫ్యాన్స్.. అంతెందుకు అల్లు ఫ్యాన్స్ కూడా దాన్ని నమ్మలేదు. బన్నీ చేసింది తప్పు అని చెప్పుకొచ్చారు.
Allu Arjun’ Statement : పోలీసులకు అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్… ఏం చెప్పారంటే?
ఇక అలా ఆ వివాదం నడుస్తున్న సమయంలోనే పుష్ప 2 రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది. ఇక అప్పటికే ఆగ్రహంతో ఊగిపోయిన మెగా ఫ్యాన్స్.. పుష్ప 2 సినిమా ఎలా రిలీజ్ అవుతుందో మేము చూస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈ నంద్యాల ఎఫెక్ట్ వలన పుష్ప 2 నెగెటివ్ టాక్ అందుకుంటుందేమో అని భయపడ్డారు. కానీ, పుష్ప 2 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అప్పుడు మరోసారి బన్నీ పేరు మారుమ్రోగిపోయింది. ఆ సమయంలోనే ఒక విషాద సంఘటన కూడా చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్టు చేశారు. ఇప్పటికే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని బన్నీ పిటిషన్ దాఖలు చేయగా .. అది విచారణకు కూడా రాకముందే చిక్కడపల్లి పోలీసులు బన్నీ విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
Allu Arjun – Pawan Kalyan : అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ రియాక్షన్
తాజాగా బన్నీని నాంపల్లి కోర్డులో హాజరుపరిచారు. ప్రస్తుతం బన్నీ అరెస్ట్ సోషల్ మీడియాను మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఆయనకు అండగా ఉండగా.. ట్రోలర్స్ మాత్రం తమ చేతులకు పనిచెప్పారు. బన్నీని ట్రోల్ చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. పుష్ప 2 సమయంలో బన్నీ, బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో సందడి చేసిన విషయం తెల్సిందే.
అప్పుడు నేషనల్ అవార్డు గురించి బన్నీ మాట్లాడుతూ.. ” టాలీవుడ్ హీరోలందరిలో ఎవరైనా నేషనల్ అవార్డు తీసుకున్నారా.. ? అని చూసాను. ఇంతవరకు ఎవరు అవార్డు తీసుకోలేదు. దాన్ని రౌండ్ అప్ చేశా .. అవార్డును అందుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను మార్చి.. “టాలీవుడ్ హీరోల్లో ఎవరైన అరెస్ట్ అయ్యారా అని చూస్తే.. ఇంత వరకు ఎవరు అరెస్ట్ అవ్వలే… దాన్ని రౌండ్ అప్ చేశా. అరెస్ట్ అయ్యా. ఇది సర్ నా బ్రాండు” అంటూ మీమ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.