WhatsApp Reels Feature: వాట్సాప్ అనేది కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, మిలియన్ల మంది ప్రజలు దీనిని తమ నిత్యజీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా యూజర్లు దీనిని ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడటం, బిజినెస్ కమ్యూనికేషన్ నిర్వహించడం, వాయిస్, వీడియో కాల్స్ చేయడం… ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ యాప్, ఇప్పుడు వినోదానికి కూడా పెద్ద పీట వేసింది.
రీల్స్ ఫీచర్
తాజాగా వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన రీల్స్ ఫీచర్ గురించి మీకు తెలుసా. ఇప్పుడు మీరు వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల మాదిరిగానే రీల్స్‌ను చూసుకోవచ్చు.. అవును ఇది నిజమే. మిమ్మల్ని మరింత ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ అద్భుతమైన అప్‌డేట్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రీల్స్ చూస్తూ గడపడం
సోషల్ మీడియాలో రీల్స్‌ను చూస్తూ సమయం గడపడం ఇప్పుడు కొత్త ట్రెండ్. బస్సుల్లో, ట్రైన్‌ల్లో, రెస్టారెంట్లలో, కార్యాలయాల్లో ఎక్కడ చూసినా రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నవారు కనిపిస్తారు.
అయిచే ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో మాత్రమే ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు వాట్సాప్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎలా చూడాలనేది ఇక్కడ చూద్దాం.
WhatsAppలో Reels ఎలా చూడాలి?
-WhatsApp యాప్ ఓపెన్ చేయండి.
-మీ స్క్రీన్‌పై మెటా ఐకాన్ (Meta Icon) కనిపిస్తుందా? దానిపై ట్యాప్ చేయండి.
-మీరు కొత్త ఇంటర్‌ఫేస్‌లోకి రీడైరెక్ట్ అవుతారు
-అక్కడ “Show me Reels” లేదా “Show me India TV Reels” అని టైప్ చేయండి.
-అప్పుడు, మీకు రీల్స్ ప్రత్యక్షమవుతాయి. ఆ క్రమంలో మీకు నచ్చిన వాటిని ఎంచుకుని చూసుకోవచ్చు.
-మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ట్రెండింగ్ రీల్స్‌ను స్క్రోల్ చేయవచ్చు.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ …
WhatsApp Statusలో కొత్త ట్విస్ట్
-కొత్తగా వచ్చిన స్టేటస్ మ్యూజిక్ ఫీచర్ గురించి ముఖ్యమైన విషయాలు:
-మీ స్టేటస్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు
-ఫోటో స్టేటస్‌కు 15 సెకన్ల వరకు, వీడియో స్టేటస్‌కు 60 సెకన్ల వరకు మ్యూజిక్ పెట్టుకోవచ్చు
-లక్షలాది పాటల నుంచి మీకు నచ్చింది ఎంచుకోవచ్చు.
-ఆ క్రమంలో మీ స్టేటస్ అద్భుతంగా మారుతుంది
మ్యూజిక్ స్టేటస్ ఎలా పోస్ట్ చేయాలి?
-WhatsApp ఓపెన్ చేసి, స్టేటస్ సెక్షన్‌కు వెళ్లండి.
-క్రియేట్ స్టేటస్‌పై ట్యాప్ చేయండి.
-మీ స్క్రీన్‌లో చిన్న మ్యూజిక్ నోట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
-మీకు నచ్చిన పాటను సెలెక్ట్ చేసుకొని, స్టేటస్‌గా పోస్ట్ చేయండి.
-ఇప్పటివరకు స్టేటస్‌లో టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేయడం ద్వారా, మన భావోద్వేగాలను మరింత ఎక్కువగా వ్యక్తపరచుకోవచ్చు.
మరిన్ని కొత్త మార్పులు వస్తున్నాయా?
-WhatsApp మేటా అధీనంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త ఫీచర్లతో దూసుకెళ్తోంది. రీల్స్, మ్యూజిక్ స్టేటస్ వంటి అప్‌డేట్‌లు ప్రస్తుతం ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మార్పులు రానున్నాయి.
-AI- ఆధారిత చాట్‌బోట్స్ – WhatsAppలో AI బోట్స్ ద్వారా మరింత మెరుగైన అనుభవాన్ని పొందొచ్చు.
-ఫైల్ షేరింగ్ లిమిట్ పెంపు – త్వరలోనే 2GB వరకు ఫైళ్లు షేర్ చేసుకోవచ్చు.
-WhatsApp Communities – పెద్ద గ్రూప్‌లను నిర్వహించేందుకు మరిన్ని సౌకర్యాలు.
-Multiple Device Support – ఒకేసారి అనేక డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునే అవకాశం.