BigTV English

MLC Kavitha : కవిత మైహోం స్కెచ్.. సవాలు వెనక రాజకీయ వ్యూహం ఉందా?

MLC Kavitha : కవిత మైహోం స్కెచ్.. సవాలు వెనక రాజకీయ వ్యూహం ఉందా?

MLC Kavitha: బీఆర్ఎస్‌లో అందరి కంటే ముందు బీసీ కులగణనపై స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దాని వెనుక బీసీ ఓటు బ్యాంకును ఓన్ చేసుకోవడమే ఆమె టార్గెట్‌గా కనిపించింది. తాజాగా హెచ్‌సీయూ భూములకు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఆమె మైహోం విహంగ అపార్ట్‌మెంట్లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కవిత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మైహోం విహంగ కూల్చే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. ఇంతకీ కవిత సవాలు విసరడం వెనక వ్యూహం ఏంటి?.. ఆమె స్కెచ్ గులాబీ పార్టీకి కలిసి వస్తుందా? వికటిస్తుందా?


వివాదస్పద భూమిని మై హోం సంస్థకు అప్పగించిన కేటీఆర్

హెచ్‌సీయూ భూముల అంశం నడుస్తున్న తరుణంలోనే కవిత లెవనెత్తిన అంశం కొత్త చర్చకు దారి తీస్తుంది. హెచ్‌సీయూ భూముల విషయంలో జరుగుతున్న రాజకీయ రగడలో కాంగ్రెస్‌ పార్టీ మైహోం విహంగ భూములు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సర్వే నెంబర్ 25లోని వివాదంలో ఉన్న భూమిని కేటీఆర్ స్వయంగా సెటిల్‌మెంట్ చేసి మైహోం సంస్థకు అప్పగించారంటూ టీపీసీసీ చీఫ్‌ స్వయంగా ఆరోపించారు.


కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించని బీఆర్ఎస్ నేతలు

అధికార కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేని తరుణంలో కవిత ఒక్కరే స్పందించారు. కవిత స్పందించిన తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో ఎవరూ మాట్లాడని అంశంపై కవిత స్పందించడం, మైహోం విహంగ అపార్ట్‌మెంట్లను కూల్చివేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ఆమె సవాల్ చేయడం గులాబీ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.

కవిత సవాలు వెనక రాజకీయ వ్యూహం ఉందా?

మైహోం విహంగ అంశంలో కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై చర్చ నడుస్తోందట. మైహోం విహంగ అక్రమ నిర్మాణాలతే…మై హోం విహంగ అపార్ట్‌మెంట్లు ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే బుల్డోజర్లను పంపించి కూల్చివేయాలని ప్రభుత్వానికి కవిత సవాలు విసిరారు. కవిత సవాలు వెనక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ స్టార్ట్‌ అయిందట. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టేందుకు కవిత కామెంట్స్‌ చేశారా…లేక ఇడైన్ ఏజెండా ఏమైనా ఉందా అని పార్టీ నేతలు చేవులు కొరుక్కుంటున్నారట. మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూల్చే ధైర్యం చేయలేరని కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నారు.

రామేశ్వరరావుతో గులాబీబాస్ కు సత్సంబంధాలు

ఎమ్మెల్సీ కవిత, మైహోం రామేశ్వరరావును బీజేపీ మనిషిగా అభివర్ణించడం రాజకీయం వ్యూహంలో భాగమనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చివరి ఆరునెలలు మినహా మైహోం రామేశ్వరరావుతో గులాబీబాస్ మంచి సంబంధాలు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్స కార్యక్రమం నాటి నుంచి ఆ ఇద్దరి మధ్య గ్యాప్‌ స్టార్ట్‌ అయింది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ రావడం.. కేసీఆర్ హాజరు కాకపోవడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Also Read: బీజేపీ కొత్త బాస్ ముహూర్తం ఎప్పుడు?

సడైన్‌గా రామేశ్వరరావును టార్గెట్ చేస్తున్న కవిత

ప్రధాని మోడీ దగ్గర అవుతున్నారనే భావనతో మైహోం రామేశ్వరరావును కేసీఆర్‌ దూరం పెట్టారన్న టాక్‌ కూడా నడిచింది. అయితే ఎలక్షన్ టైమ్‌లో మాత్రం అంతా సర్దుకుందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సడైన్‌గా కవిత మైహొం రామేశ్వరరావును టార్గెట్‌ చేయడంపై బీఆర్ఎస్‌లో హాట్‌ హాట్ డిబేట్ నడుస్తోందట. ప్రధాని మోడీతో మైహోం రామేశ్వరరావుకు సత్సంబంధాలు ఉన్నాయన్న భావనతోనే కవిత.. ఆయనపై బీజేపీ మనిషి అని ముద్ర వేశారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో సత్సంబంధాలు తెగిపోయాయి కాబట్టే…రామేశ్వరరావును బీజేపీకి ఆపాదించారంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకేళ్లే వ్యూహం..

ప్రధానితో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌‌కు రాజకీయ వైరం ఉంది కాబట్టి.. పనిలో పనిగా వివాదం వచ్చింది కాబట్టి మైహోం సంస్థను కూడా బీజేపీ ఖాతాలో వేయాలనేది కవిత వ్యహంగా కనిపిస్తోందంటున్నారు. తాను చేసిన సవాలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే కాబట్టి చర్యలు తీసుకోలేదని ప్రజల్లోకి తీసుకువెళ్లోచ్చనేది కవిత ప్లాన్‌గా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. అయితే పార్టీలో ఎవరూ స్పందించని అంశంపై కవిత ఎందుకు మాట్లాడారు అనే దానిపై కూడా గులాబీ నేతల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోందంట.

స్పందించని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వాస్తవానికి ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ స్పందించాల్సి ఉంది…కానీ కవిత స్పందించడంపై అందరూ తలలు పట్టుకుంటున్నారట. అందులోను బీఆర్ఎస్‌ పార్టీలోని ముఖ్యనేతలతో మైహోం రామేశ్వరరావుకు సత్సంబంధాలున్న విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటూ ఈ రగడ ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అని తెగ ఇదై పోతున్నారంట. మొత్తమ్మీద కవిత వ్యూహం బీఆర్ఎస్‌పై రాజకీయంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×