Kingdom:విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి, ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అందరినీ కట్టిపడేసారని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన ఈయన వరుసగా ‘ద్వారక’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఏ మంత్రం వేసావే’, ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అంటూ పలు చిత్రాలు చేశారు. అందులో గీతా గోవిందం సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఇకపోతే స్టార్ స్టేటస్ ను అందించిన చిత్రం మాత్రం ‘అర్జున్ రెడ్డి’ అనే చెప్పాలి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లోనే స్టార్ ను చేసేసింది. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమాతో ఫ్యామిలీ హీరోగా కూడా పేరు దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ
కింగ్ డమ్ పైనే రౌడీ హీరో ఆశలన్నీ..
తర్వాత పలు చిత్రాలు చేశారు. కానీ ఏవీ కూడా అనుకున్నంత స్థాయిలో ఇమేజ్ అందించలేదు. ఇక మధ్యలో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేశారు. పైగా పాన్ ఇండియా మూవీగా తొలిసారి రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా బొక్క బోర్ల పడింది. ఆ తర్వాత సమంత(Samantha ) తో కలిసి ‘ఖుషీ’, మృణాల్ ఠాకూర్ (Mrunhal Thakur) తో కలిసి ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు చేశారు. కానీ ఇవి డీసెంట్ హిట్ ను అందించాయి. కానీ బ్లాక్ బస్టర్ విజయం మాత్రం ఇప్పటివరకు ఆయన ఖాతాలో పడలేదు. ఈ క్రమంలోనే తాజాగా ‘కింగ్ డమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse) కాంబినేషన్లో గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ (Surya Devara NagaVamshi), ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సతీమణి సాయి సౌజన్య(Sai Soujanya) ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సత్యదేవ్ (Sathyadev) ప్రధాన పాత్ర పోషించగా ఇటీవల టీజర్ ని కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ సినిమా మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
ALSO READ:Vishnu Priya: తప్పు ఒప్పుకున్న విష్ణుప్రియ.. ఒకటి కాదు.. 15 యాప్స్‌కి అంటూ స్టేట్మెంట్..!
కింగ్ డమ్ పై నిర్మాత మాస్ ఎలివేషన్స్..
ఇకపోతే విడుదల తేదీకి కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉండడంతో అటు మేకర్స్ కూడా ఎవరికి వారు సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. “ముఖ్యంగా లాజిక్స్, స్క్రీన్ ప్లే, యాక్షన్ , గ్రాండీరియర్
లాంటివి ప్రేక్షకులు ఎన్ని కోరుకున్నా.. అవన్నీ కూడా ఈ “కింగ్ డమ్” లో ఉంటాయి. ఇక మీరు ఏమి ఊహించి సినిమాకి వస్తారో మాకు బాగా తెలుసు అలాంటివన్నింటినీ ఈ కింగ్డమ్ బీట్ చేస్తుంది. ప్రేక్షకుడికి మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది” అంటూ కింగ్ డం మూవీ పై మాస్ ఎలివేషన్స్ ఇచ్చారు నాగ వంశీ. మరి నిర్మాత చెప్పిన మాటల ప్రకారం చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కింగ్డమ్ కూడా రెండు భాగాలుగా రాబోతోందని, మొదటి సినిమా ఫలితాన్ని బట్టి రెండవ సినిమాకు కింగ్డమ్ 2 అని టైటిల్ పెట్టాలా? లేక కింగ్డమ్ స్క్వేర్ అని పెట్టాలా? అని ఆలోచిస్తామంటూ తెలిపారు.