Tamil Nadu Murder: కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం అన్నట్లు.. ఎంతో మందిని ఘోరంగా చంపిన ఓ పేరు మోసిన రౌడీ షీటర్ చివరకు ప్రత్యర్ధుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని సేలమ్- నసియానూర్ హైవేపై జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చకర్లు కొడుతోంది.
జాన్ అనే 35 ఏండ్ల వ్యక్తి చాణక్య తరుప్పూర్ లోని పెరియపాళ్యం నివాసి. అతడి మీద సేలం అంతటా పలు పోలీస్ స్టేషన్లలో బోలెడు కేసులు ఉన్నాయి. వాహనాల అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటాడు. దందాలు, సెటిల్ మెంట్లు వేరే ఉన్నాయి. ఓ గ్యాంగ్ ను మెయింటెయిన్ చేసే వాడు. ల్యాండ్ సెటిల్ మెంట్లు కొనసాగించేవాడు. అడ్డు వచ్చిన వాళ్లను ఏమాత్రం ఆలోచించకుండా లేపేసేవాడు. ప్రస్తుతం అయ్యగారి మీద అనేక కేసులు ఉడటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు సేలం ప్రాంతంలో ఆయన ఓ పేరు మోసిన దాదాగా చలామణి అవుతున్నాడు.
పట్టపడలే నడిరోడ్డు మీద రౌడీషీటర్ హత్య
తాజాగా జాన్ తన ఫ్యామిలీతో కలిసి సేలమ్- నసియానూర్ హైవేపై కారులో ప్రయాణిస్తుండగా, దుండగులు అటాక్ చేశారు. బుధవారం(మార్చి 19న) అన్నదానపట్టి పోలీస్ స్టేషన్ లో హాజరైన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక కారు అతనిని వెంబడించింది. జాతీయ రహదారి ఎక్కిన తర్వాత ఆ వాహనం జాన్ కారును బలంగా ఢీకొట్టింది. నసియనూర్ సమీపంలో జాన్ వెంటనే కారు ఆపాడు. వెంటనే వెనుక నుంచి వచ్చిన కారులో నుంచి నలుగురు వ్యక్తులు కత్తులతో దిగారు. కారులో ఉన్న అతడి భార్య శరణ్యను కిందికి లాగి, జాన్ మీద దాడి చేశారు. అతడు కారులో నుంచి బయటకు దిగేందుకు ప్రయత్నించినా, బయటకు రాకుండా నలుగు నాలుగు వైపుల నుంచి విచక్షణా రహితంగా కత్తులతో నరికారు. తన భర్తను చంపొద్దని శరణ్య వాళ్లను వేడుకున్నా, పట్టించుకోలేదు. దుండగుల దాడిలో జాన్ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే చనిపోయాడు. ఈ హత్యకు సంబందించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. నలుగురు వ్యక్తులు దాడి చేస్తున్నట్లు అందులో కనిపించింది. వాళ్లు జాన్ ను నరుకుతుంటే పక్కన వెళ్లే వాళ్లు భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు.
A 35-year-old history-sheeter from Salem was hacked to death by an unidentified gang at Nasiyanur on the Salem-Coimbatore National Highway in Erode district on Wednesday (March 19, 2025). #news pic.twitter.com/9BEawdc6Qy
— Chennai Live Digital 104.8 (@chennailive1048) March 19, 2025
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
విషయం తెలియడంతో సిథోడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం పెరుండురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అటు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లే. నిందితుల్లో ముగ్గురు సరీష్, శరవణన్, భూపాలన్ ను ముందుగా పట్టుకున్నారు. ఆ తర్వాత నాల్గవ నిందితుడు కార్తీక్ ను అరెస్టు చేశారు. హత్యకు సెటిల్ మెంట్ల గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
Read Also: పిల్లల దొంగల ముఠా అరెస్ట్.. వీళ్ళు చిన్నారులను ఎలా అమ్ముతారంటే!