BigTV English

Somesh Kumar: అందుకోసమే సోమేశ్‌కు ఆ పదవా? కేసీఆర్ మామూలోడు కాదుగా!

Somesh Kumar: అందుకోసమే సోమేశ్‌కు ఆ పదవా? కేసీఆర్ మామూలోడు కాదుగా!
kcr somesh

Somesh Kumar: సోమేశ్ కుమార్‌ను తన ప్రధాన సలహాదారుగా సీఎం కేసీఆర్ నియమించుకోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవడానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవే అయినా.. బీఆర్‌ఎస్ కోసం సోమేశ్ కుమార్ కు పని చేయబోతన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం సోమేశ్‌కు ఉంది. ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని తగ్గించే మార్గాలను రూపొందించే పని చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విక్టరీనే లక్ష్యంగా సోమేశ్ పాలనాపరంగా పావులు కదపనున్నారని సమాచారం.


ఇంకో వెర్షన్ ప్రకారం… సోమేష్ కుమార్ కి బిహార్ రాజ‌కీయ‌లపై మంచి ప‌ట్టు ఉంది. ప్రశాంత్ కిషోర్ తో చ‌నువు కూడా ఉందంటున్నారు. అటు దేశ రాజకీయాలపై కూడా పూర్తిస్థాయి అవగాహన ఉండడంతో ఆయన సేవలను బీఆర్ఎస్ విస్తరణ దిశగా వినియోగించుకోనున్నట్లు తెలిసింది. రకరకాల స‌ర్వేల ఇన్‌పుట్స్ అన్నీ సోమేష్ కుమారే ఎప్పటికప్పుడు కేసీఆర్ కి చెబుతుంటారనే టాక్ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సోమేష్ కుమార్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ లోని ఏదో ఒక స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఐఏఎస్‌లతో లాబీయింగ్‌ కోసమే సీఎం కేసీఆర్‌, మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. తాను చెప్పింది నిజం కాకపోతే, ప్రధాన సలహాదారుగా సోమేశ్‌ను నియమించడం వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలంగాణ అధికారి కావడం వల్లనే సలహాదారు పదవి దక్కలేదని ఆరోపించడం ఆసక్తిగా మారింది.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×