BigTV English

Pushpa 2 Tickets: ఆన్‌లైన్‌లో కనిపించని ‘పుష్ప 2’ ప్రీమియర్ టికెట్స్.. దీని వెనుక అంత ప్లాన్ ఉందా?

Pushpa 2 Tickets: ఆన్‌లైన్‌లో కనిపించని ‘పుష్ప 2’ ప్రీమియర్ టికెట్స్.. దీని వెనుక అంత ప్లాన్ ఉందా?

Pushpa 2 Tickets: ప్రస్తుతం ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో కూడా ఎక్కడ చూసినా ‘పుష్ఫ 2’ గురించే మాట్లాడుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మరికొన్ని రోజుల్లో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాకు పెరిగిన టికెట్ ధరల గురించే ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. ఒక మామూలు మిడిల్ క్లాస్ మూవీ లవర్ కొనుగోలు చేయలేని రేంజ్‌లో ‘పుష్ప 2’ టికెట్ ధరలను పెంచేశారు నిర్మాతలు. అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీ ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్స్‌ను ఇంకా ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయలేదు. దీని వెనుక పెద్ద ప్లానే ఉందని ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి.


విడుదల చేయలేదు

‘పుష్ప 2’ ప్రీమియర్ షో టికెట్లను మల్టీప్లెక్స్‌లో రూ.1239కు పెంచేశారు. సింగిల్ స్క్రీన్స్‌లో కూడా ఈ ధరలు వెయ్యికు పైనే ఉన్నాయి. అయినా కూడా కొందరు ఫ్యాన్స్ మాత్రం ఎంత అయినా పర్వాలేదు ‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ ప్రీమియర్ షోలకు ఇంకా రెండు రోజులే సమయం ఉన్నా టికెట్స్ ఇంకా ఆన్‌లైన్‌లో విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. మామూలుగా ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు కొన్ని థియేటర్స్‌లో దాదాపు వారం రోజుల నుండే టికెట్స్ విడుదల అవ్వాలి. ‘పుష్ప 2’ విషయంలో అలా జరగకపోవడంతో ఇండస్ట్రీలో దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి.


Also Read: ఫ్యాన్స్ అల్టిమేటం… షూటింగ్ సెట్‌కి వెళ్లిపోయిన చిరు

దానికంటే ఎక్కువ

‘పుష్ప 2’ (Pushpa 2) టికెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది. దీంతో ఆ పెరిగిన టికెట్ ధరల గురించి మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయినా ఇంకా ఈ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేయలేదు మేకర్స్. దీని వెనుక బలమైన కారణం ఉండవచ్చని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తే అందులో చూపించిన ధరకే టికెట్లు అమ్ముడుపోతాయి. అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో ఈ టికెట్లను అమ్మితే అనుకున్న దానికంటే ఎక్కువ ధరలతో కూడా వీటిని విక్రయించే అవకాశం ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలా అయితే సినిమాకు మరిన్ని లాభాలు వస్తాయి.

అదే ప్లాన్

ఇప్పటికే ‘పుష్ప 2’కు పెరిగిన టికెట్ ధరల వల్ల సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తాయి. అయినా కూడా టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అనధికారకంగా టికెట్లను అమ్మినా కూడా వాటిని కొని ప్రీమియర్ షోలను చూడాలనుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో ఈ ప్లాన్ వర్కవుట్ ఖాయమని అనుకుంటున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ సినిమా కలెక్షన్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డులు సాధించేలా చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×