Sobitha Dhulipalla: అక్కినేని ఇంట పెళ్లి పనులు చకచకా జరుగుతున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోయిన్ సమంతతో అక్కినేని నాగ చైతన్య విడాకులు తీసుకున్న మూడేళ్ళ తరువాత అతను రెండో వివాహం చేసుకోబోతున్నాడు. నటి శోభితా ధూళిపాళ్ల తో చై వివాహం డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం, హల్దీ వేడుకలు పూర్తయ్యాయి. నేడు శోభితాను పెళ్లి కూతురును చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ పెళ్లి మొత్తం తెలుగుదనం ఉట్టిపడేలా అక్కినేని కుటుంబం నిర్వహిస్తున్నారు. అచ్చ తెలుగు పెళ్లి ఎలా ఉంటుందో.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో చై- శోభితా పెళ్లి జరగనుంది. మొదటి నుంచి కూడా శోభితా తెలుగుదనం ఉట్టిపడేలా పెళ్లి కార్యక్రమాల్లో కనిపిస్తుంది. నిండైన చీరకట్టు, పాతకాలం నాటి ఆభరణాలు ధరించి ఎంతో అద్భుతంగా కనిపించింది. ఎరుపు రంగు పట్టుచీరలో శోభితా అందంగా కనిపించింది.
Bigg Boss 8 Telugu Promo: నువ్వు యష్మీని వాడుకున్నావు.. నిఖిల్‌లోని ఫైర్ బయటికి తీసుకొచ్చిన గౌతమ్
చైకు ఈ వివాహం రెండోది అయినా.. శోభితాకు మాత్రం మొదటిది కావడంతో.. ఆమె ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా కోరుకున్నవాడిని పెళ్లి చేసుకుంటున్నాను అనే ఆనందం ఆమెలో కనిపిస్తుంది. ఇక శోభితా తన దుస్తులతోనే నెటిజన్స్ ను కట్టిపడేస్తుంది. ఈ జనరేషన్ పెళ్లి కూతుర్లులా లెహంగాలు, స్లీవ్ లెస్ జాకెట్స్ లేకుండా.. నిండైన చీరకట్టు.. అది కూడా పాతతరం ఫుల్ నెక్ జాకెట్స్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడే పెద్ద చర్చ మొదలయ్యింది.
శోభితా ధూళిపాళ్ల.. అక్కినేని ఇంటి కోడలు కాకముందు అమ్మడు అందాల ఆరబోత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న పెద్దల మాటను.. ఈ చిన్నది రివర్స్ లో రచ్చ గెలిచి ఇంట గెలవడానికి వచ్చింది. బాలీవుడ్ లో నటిగా అడుగుపెట్టిన శోభితా చేయని అందాల ఆరబోత లేదు. బికినీ దగ్గరనుంచి ఇంటిమేటెడ్ సీన్స్ వరకు అన్ని చేసింది. సబ్బు యాడ్ నుంచి కండోమ్ యాడ్ వరకు ఒక మోత మోగించింది.
Ariana Viviana – Kannappa: గిరిజన వేషధారణలో విష్ణు డాటర్స్.. పోస్టర్ వైరల్..!
బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో తన సత్తా చాటింది. ఇక చివర్లో టాలీవుడ్ కు వచ్చి చేరింది. ఇక్కడ శోభితా అంతగా గుర్తింపు తెచ్చుకున్నది లేదు. గూఢచారి, మేజర్ లాంటి సినిమాలో నటించింది. అది కూడా ఫుల్ లెంత్ రోల్ కూడా కాదు. ఒక దాంట్లో కీలక పాత్రలో మెరవగా.. ఇంకో దాంట్లో క్యామియోలో కనిపించింది. మొదటి సినిమా సమయంలోనే అమ్మడికి చై పరిచయమయ్యాడు. అప్పటినుంచి వీరి పరిచయం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం పెళ్లికి దారితీసింది.
ఇక ఇప్పుడు అందరి మైండ్ లోనూ మెదిలే మాట ఒక్కట్టే. ఈ తెనాలి అమ్మాయి తెలుగుదనం కేవలం పెళ్లి వరకేనా.. ? లేక పెళ్లి తరువాత కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా.. ? అని. అంటే పెళ్లి తరువాత శోభితా సినిమాలు చేస్తుందా.. లేక అత్త అమలలా గృహిణిలా సెటిల్ అవుతుందా.. ? ఒకవేళ సినిమాలు చేయాల్సి వస్తే.. సామ్ చేసినట్లు లేడీ ఓరియెంటెడ్ చేయాలి. అలా చేయడానికి టాలీవుడ్ లో శోభితాకు అంత మార్కెట్ లేదు. అయితే మళ్లీ గ్లామర్ రోల్స్ చేస్తుందా.. ? పెళ్లి తరువాత తన పాత ప్రపంచానికే అక్కినేని కోడలు వెళ్తుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.