E-Paper
Advertisement

గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!

గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!
Advertisement

Bank Shock: బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సబ్సిడీ ఖాతాలో పడిందో లేదో చెక్ చేసుకునేందుకు బ్యాంక్ కు వెళ్లిన ఓ మహిళ.. తన అకౌంట్ లో ఉన్న డబ్బు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. బట్టలు కుట్టుకుంటూ జీవించే ఆమె బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ.100 కోట్లు జమ కావడం మహిళతో పాటు బ్యాంక్ అధికారులను షాక్ కు గురిచేసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

కాశ్మీరా షేక్ అనే మహిళ తన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి కుల్తాలీ జమ్‌తలా ప్రాంతంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌కు వెళ్లారు. అక్కడి బ్యాంక్ సిబ్బంది పాస్‌బుక్ పరిశీలించి, ఆమె ఖాతాలో రూ. 99,99,99,997 (రూ. దాదాపు రూ.100 కోట్లు) ఉన్నట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. అంత పెద్ద మొత్తంలో డబ్బు తన ఖాతాలోకి ఎలా వచ్చిందో తెలియక లబోదిబోమన్నారు. దీంతో బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆమె ఖాతాను ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సొమ్ముపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

మరో కేసూ వెలుగులోకి!

Advertisement

అయితే బెంగాల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కోల్‌కతాలోని బేలేఘాటా ప్రాంతంలో క్లౌడ్ కిచెన్ నిర్వహిస్తున్న నూపూర్ గుప్తా అనే మరో మహిళ ఖాతాలో కూడా రాత్రికి రాత్రి రూ. 47 కోట్లు జమ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన నూపూర్ వెంటనే పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, సంబంధిత బ్యాంక్ వర్గాలు, ఇన్‌కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) శాఖ అధికారులు సంయుక్తంగా దీనిపై విచారణ ప్రారంభించారు.

Also Read: రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!

సిస్టమ్ పొరపాటేనా?

Advertisement

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఈ తరహా వింత పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ విధమైన అంకెలు.. సామాన్యుల ఖాతాల్లో ప్రత్యక్షమవుతున్నాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. తాజాగా మహిళ ఖాతాలో రూ.100 కోట్లు కనిపించడంలోనూ సర్వర్ లో తేడా ఉందా? లేదా దీని వెనుక ఏదైనా నెట్ వర్క్ ఉందా? అన్నదానిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఖాతాను ఫ్రీజ్ చేయడం వల్ల అవసరాలకు తమ డబ్బు కూడా తీసుకోలేకపోతున్నామని కాశ్మీరా షేక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!

Tags

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×