E-Paper
Advertisement

రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!

రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!
Advertisement

JioHome Plans: ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత చేరువ చేసేందుకు జియో సరికొత్తగా ‘జియోహోమ్’ (JioHome) ప్యాక్‌లను తీసుకొచ్చింది. లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీ స్ట్రీమింగ్ సేవలను కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా విడివిడిగా లేదా కలిపి ఈ ప్యాక్‌లలో అందించనున్నారు. ఇంటికి కేవలం టీవీ కనెక్షన్ కావాలన్నా, లేక వై-ఫై ఇంటర్నెట్ పొందాలన్నా, లేదా రెండూ కలిపి కావాలన్నా కస్టమర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

జియోమొబైల్ కనెక్షన్ లేకపోయినా..

ఈ జియోహోమ్ సేవలను పొందడానికి కస్టమర్ల వద్ద కచ్చితంగా జియో మొబైల్ నంబర్ ఉండాల్సిన పనిలేదు. జియో మొబైల్ కనెక్షన్ లేని కొత్త వినియోగదారులు సైతం ఈ ప్యాక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉండి టీవీ మాత్రమే కావాలనుకునే వారు ‘జియోహోమ్ టీవీ-ఓన్లీ’ ప్యాక్ ను ఎంచుకోవచ్చు.

కేవలం రూ.400 మాత్రమే..

Advertisement

టీవీ ఓన్లీ ప్యాక్ ధర నెలకు రూ. 400 పడుతుంది. అయితే దీనిని పొందడానికి కస్టమర్లు ఒకేసారి 5 నెలలకు కలిపి రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, టీవీలో యూట్యూబ్ సౌలభ్యం, లైవ్ ప్రోగ్రామ్‌లను పాజ్ చేసి మళ్లీ ప్లే చేసుకునే ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా వెల్కమ్ ఆఫర్‌ కింద 12కి పైగా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ కూడా లభిస్తుంది.

కేవలం ఇంటర్నెట్ కావాలంటే..

ఒకవేళ లైవ్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉండి.. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే అవసరమైతే.. ‘జియోహోమ్ వైఫై-ఓన్లీ’ ప్లాన్‌ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విభాగంలో 30Mbps, 100Mbps వేగంతో కూడిన రెండు రకాల ప్లాన్‌లను జియో ఆఫర్ చేస్తోంది. 30Mbps ప్లాన్ ఎంచుకుంటే.. నెలకు రూ. 440 ఖర్చు కానుంది. దీనిని పొందడానికి 5 నెలల కాలానికి రూ. 2,200 ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 100Mbps ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ.600 చొప్పున 5 నెలల కాలానికి రూ.3,000 చెల్లించాలి.

వైఫై, టీవీ, ఓటీటీ ప్యాక్‌లు

Advertisement

ఇంటర్నెట్, వినోదం రెండూ కలిపి కావాలనుకునే కుటుంబాల కోసం జియో ఆల్ రౌండ్ ప్యాక్‌లను కూడా ప్రకటించింది. 30Mbps బండిల్డ్ ప్యాక్ నెలకు రూ. 555 పడుతుంది. కస్టమర్లు రూ. 2,222 చెల్లించి 4 నెలల సేవలను పొందవచ్చు. ఇందులో ఒక నెల సేవలను ఫ్రీగా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వైఫై, 1,000+ లైవ్ ఛానెళ్లు, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, సన్ నెక్స్ట్ వంటి 12కి పైగా ఓటీటీ యాప్‌ల యాక్సెస్ కూడా లభిస్తుంది.

Also Read: BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ఎంత బాగుందో..!

100Mbps బండిల్డ్ ప్యాక్

ఒకవేళ 100Mbps బండిల్డ్ ప్యాక్ ఎంచుకుంటే.. నెలకు రూ. 707 పడుతుంది. దీనికోసం 3 నెలలకు గాను రూ. 2,122 చెల్లించాలి (ఇందులో ఒక నెల ఉచితం). ఇందులోనూ పైన పేర్కొన్న అన్ని టీవీ, స్ట్రీమింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఇక కొత్త కస్టమర్ల సౌలభ్యం కోసం జియో సంస్థ ఇంటి వద్దే డోర్‌స్టెప్ ఇన్‌స్టాలేషన్ సేవలను అందిస్తోంది. అయితే కస్టమర్లు ప్యాక్‌ను ఎంచుకునే ముందు.. జియో అందిస్తున్న బెనిఫిట్స్ తో పాటు ఇన్‌స్టాలేషన్ రూల్స్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్.

Also Read: వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!

Tags

Related News

BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్‌ ఎంత బాగుందో..!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న..IFB వాషింగ్ మెషీన్! ధర కూడా చాలా తక్కువ

వీఐ గుడ్ న్యూస్.. 365 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్ స్టార్!

పోర్ట్రోనిక్స్ డాష్ 4 పార్టీ స్పీకర్.. తక్కువ ధరలో అద్భుతమైన సౌండ్!

ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!

పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్న Oppo ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు!

50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×