BigTV English

Xiaomi 15 Series: సాంసంగ్‌కు గట్టి పోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్.. 200MP కెమెరాతోపాటు..

Xiaomi 15 Series: సాంసంగ్‌కు గట్టి పోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్.. 200MP కెమెరాతోపాటు..

Xiaomi 15 Series: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో అనేక మోడళ్లను ఆయా కంపెనీలు మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ Xiaomi తాజాగా కొత్త Xiaomi 15 సిరీస్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. Xiaomi 15, Xiaomi 15 Ultra 5G మోడళ్లతో ఈ సిరీస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌ను కంపెనీ గతంలో విదేశాల్లో లాంచ్ చేయగా, ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. Xiaomi 15 సిరీస్‌ శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది.


తక్షణ తగ్గింపు

Xiaomi 15 Ultra మోడల్ భారతదేశంలో 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ. 1,09,999 ధరతో అందుబాటులో ఉంది. ముందస్తు బుకింగ్ చేసుకునే వినియోగదారులు ICICI బ్యాంక్ కార్డుతో రూ. 10,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే ఉచిత ఫోటోగ్రఫీ కిట్ లెజెండ్ ఎడిషన్ (రూ. 11,999 విలువైన) కూడా అందించబడుతుంది. అదే సమయంలో Xiaomi 15 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ. 64,999 ధరకు అందుబాటులో ఉంది.

ప్రత్యేక ఆఫర్లు

ముందస్తుగా ఆర్డర్ చేసే వినియోగదారులు రూ. 5,999 విలువైన Xiaomi కేర్ ప్లాన్‌తో పాటు ICICI బ్యాంక్ కార్డులతో రూ. 5,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ బుకింగ్ 19 మార్చి నుంచి 2 ఏప్రిల్ 2025 వరకు ఉంటుంది. ముందుగా ఆర్డర్ చేసుకునే వినియోగదారులు ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు. Xiaomi 15 సిరీస్ అమెజాన్, Xiaomi ఇండియా ఇ స్టోర్, ఎంపిక చేసుకున్న ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Read Also: Smartphone: 7,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. దిమ్మతిరిగే ఫీచర్స్..

Xiaomi 15, 15 Ultra స్పెసిఫికేషన్లు

Xiaomi 15 Ultra 6.73 అంగుళాల WQHD+ (1440 x 3200 పిక్సెల్స్), క్వాడ్-కర్వ్డ్ LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. గరిష్ట ప్రకాశం 3,200 నిట్‌ల వరకు ఉంటుంది. Xiaomi షీల్డ్ గ్లాస్ 2.0 ద్వారా రక్షించబడుతుంది. దీనికి HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. స్టాండర్డ్ Xiaomi 15 6.36-అంగుళాల ఫుల్ HD+ (1200 x 2670 పిక్సెల్స్) LTPO AMOLED డిస్ప్లేతో లభిస్తుంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లలో

ఈ రెండు మోడల్స్‌లో Qualcomm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC కలదు. Xiaomi 15 12GB RAM, 512GB స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే Xiaomi 15 Ultra 16GB RAM, 1TB స్టోరేజ్ వేరియంట్లతో లభిస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో Android 15 ఆధారిత HyperOS 2.0 ఓపెన్ సిస్టమ్‌ కలదు.

కెమెరా సామర్థ్యం

Xiaomi 15 Ultraలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP సోనీ టెలిఫోటో లెన్స్, 200MP ISOCELL HP9 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ చేస్తాయి. 3x ఆప్టికల్ జూమ్, 4.3x పెరిగిన ఆప్టికల్ జూమ్‌ను కూడా అందిస్తాయి. అలాగే Xiaomi 15లో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో లెన్స్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెండో కెమెరా కూడా OISతో సపోర్ట్ కల్గి ఉంటుంది. దీని సెల్ఫీ కెమెరా 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

Xiaomi 15 Ultra 5,410mAh బ్యాటరీతో వచ్చి, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్ Xiaomi 15 5,240mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×