Jr NTR : తరచుగా అరుదైన వాచ్ కలెక్షన్ తో అభిమానులను ఆశ్చర్యపరిచే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఒకరు. ఆయన ఖరీదైన లగ్జరీ బ్రాండ్ వాచ్ లను ధరించి, ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే రిచర్డ్ మిల్లే, బల్గారీ, పటేక్ ఫిలిప్పే వంటి ఖరీదైన ఇంటర్నేషనల్ బ్రాండ్ వాచ్ లు ఉన్నాయి. వాటి ధర లక్షల నుంచి మొదలు పెడితే కోట్లలో ఉంటుంది. తాజాగా మరో కొత్త వాచ్ తో ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చారు ఎన్టీఆర్. మరి ఆ టైమ్ లో ఆయన పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే ఎవ్వరికైనా.
ఎన్టీఆర్ కొత్త వాచ్ ధర కోట్లలోనే…
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ముంబై విమానాశ్రయంలో ఉబర్ కూల్ లుక్ లో కన్పించారు. క్యాజువల్ డ్రెస్సింగ్ లోనే ఆయన స్టైలింగ్ స్టేట్మెంట్ చూస్తే అట్రాక్ట్ కావాల్సిందే. క్లాసీ డ్రెస్ తో పాటు ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న అల్ట్రా-లగ్జరీ రిస్ట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన రిచర్డ్ మిల్లె ఆర్ఎం 40-01 టూర్‌బిల్లాన్ మెక్‌లారెన్ స్పీడ్‌టెయిల్ వాచ్ ను ధరించి కనిపించాడు. దీని విలువ అక్షరాలా రూ. 7.47 కోట్లు ఉంటుంది. దీంతో అభిమానులు అతని హై-ఎండ్ ఫ్యాషన్ అభిరుచికి మంత్రముగ్ధులవుతున్నారు.
ఎన్టీఆర్ వాచ్ కలెక్షన్
‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఓపెనింగ్ ఫోటోల్లో తారక్ ధరించిన ఖరీదైన వాచ్ అప్పట్లో నందమూరి అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. దీని ధర సుమారు రూ. 2.4 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. లగ్జరీ రిస్ట్ వాచ్ ల ప్రపంచంలో పటేక్ ఫిలిప్ ప్రత్యేకతే వేరన్న విషయం తెలిసిందే. తారక్ దగ్గర పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్-రిఫరెన్స్. 5370 వాచ్ కూడా ఉండగా, ఈ వాచ్ తో తారక్ పలు ఈవెంట్లలో పెట్టుకుని కనిపించారు. దీని ధర ధర సుమారుగా రూ. 2.46 కోట్లు. ఇంకా సుమారుగా రూ.17.10 లక్షల విలువైన బల్గారీ గెరాల్డ్ జెంటా ఆక్టా బి రిట్రో – BG043BSCVABR బ్రాండ్ వాచ్, రూ. 4.2 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోగ్రాఫ్ మెక్‌లారెన్- RM 11-03 వంటి ఖరీదైన వాచ్ లు ఎన్టీఆర్ వాచ్ కలెక్షన్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు రిచర్డ్ మిల్లె ఆర్ఎం 40-01 టూర్‌బిల్లాన్ మెక్‌లారెన్ స్పీడ్‌టెయిల్ వాచ్ కూడా ఆ లిస్ట్ లో చేరింది.
ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘NTR 31’ షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. అంతకంటే ముందు ‘వార్ 2’ (War 2) షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారు తారక్. అయితే ఈ మూవీలో నటిస్తున్న మరో హీరో హృతిక్ రోషన్ గాయాల పాలవ్వడంతో ‘వార్ 2’ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఏదో ఒక సమస్యతో ఈ మూవీ షూటింగ్ రోజురోజుకూ ఆలస్యం అవుతూనే ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">