Big Stories

Xiaomi 15 Mobile Features Leak: రారాజు వచ్చేస్తున్నాడు.. Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్.. దీనికి తిరుగులేదు..!

Xiaomi 15 Mobile Features Leak: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ కొత్త ఫోన్ తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో షియోమీ15 ఫోన్‌ను చైనాలో విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే తాజగా దీనికి సంబంధించి డిజిటల్ చాట్ సేషన్ షియోమీ 15, 15 ప్రో గురించిన సమాచారాన్ని లీక్ చేసింది. ఇప్పుడు లీకర్ Xiaomi 15 సిరీస్ ఫోన్ కొన్ని కొత్త ముఖ్యమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ తాజా అప్‌డేట్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Xiaomi 15 Specifications
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో DCS Weibo పోస్ట్ ప్రకారం ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. Xiaomi 15 ఫ్లాట్ OLED LTPO స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌‌తో వస్తుంది. స్క్రీన్ సైజ్ మాత్రం అందుబాటులో లేదు. షియోమీ 15 ఫోన్ 6.36-అంగుళాల డిస్‌ప్లే సపోర్ట్‌తో ఉన్న షియోమీ 14 వంటి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌గా ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

షియోమీ 15లో ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్,  50 మెగాపిక్సెల్ 3.x టెలిఫోటో మాక్రో లెన్స్ ఉంటాయి. అనేక ఎపర్చరులతో ఫోన్‌లో అనేక ఫోటోగ్రఫీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అలానే ఫోన్ 16GB RAM+ 1 TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్‌లు ఉంటాయి.

Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా?.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ.. ఇప్పుడే కొనేయండి!

షియోమీ 15 రెండు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. అంతే కాకుండా ఫోన్‌లో పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంటుంది. లీకైన అప్‌డేట్‌లలో బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్ గురించి తెలియలేదు. అయితే బ్యాటరీ సెల్ మెటీరియల్ తేలికైన, సన్నగా ఉండే డిజైన్‌ ఉంది. దీని ప్రకారం ఇది పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. షియోమీ 14 90W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,610mAh బ్యాటరీపై వస్తుంది. షియోమీ 15 4,800mAh నుండి 5,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్, వేగన్ లెదర్, వేగన్ లెదర్ స్ప్లికింగ్ ఆప్షన్‌లతో సహా బ్లాక్, వైట్ కలర్ వేరియంట్‌లతో మంచి డిజైన్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News