Big Stories

Rishabh Pant: రిషబ్ పంత్.. టీమ్ ఇండియాలో ఒకే ఒక్కడు..!

Rishabh Pant is the only One in Team India: టీమ్ ఇండియాలో పేర్లు చూస్తే.. అరవీర భయంకరంగా ఉంటాయి. వారి వెనుక రికార్డులు ఇంకా పవర్ ఫుల్ గా ఉంటాయి. కానీ టీ 20 ప్రపంచకప్ లో చూస్తే ఇంకా అవేవీ కనిపించడం లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ తో కలిపి ఇప్పుడు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క రిషబ్ పంత్ మాత్రమే ఆడాడు.

- Advertisement -

మరి పంత్ ఎవరు? బ్యాటరా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  తను  వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.. అంటే ఒక మోస్తరు ఆల్ రౌండర్ అంతే. తనపై స్పెషలిస్టు బ్యాటర్లు అందరూ ప్రతి మ్యాచ్ లో ఆధారపడితే ఎలా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. తనిప్పుడే ఆరోగ్యం బాగయ్యి, ఏదో దేవుని దయ వల్ల మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఎంతో కష్టపడి మళ్లీ టీమ్ ఇండియాలోకి సెలక్ట్ అయ్యాడు.

- Advertisement -

ఇప్పుడు తనకి కొంత రెస్ట్ ఇవ్వాలి. అలాంటి అరుదైన ఆటగాడ్ని కాపాడుకోవాలి. అంతేకానీ ఇలా పిండేయకూడదని అంటున్నారు. నిజానికి పాకిస్తాన్ మ్యాచ్ లో పంత్ చేసిన 42 పరుగులే హయ్యస్ట్ స్కోరు. అంతేకాదు కీపర్ గా మూడు అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. మరి ఒకవైపు పరుగులు చేస్తూ, క్యాచ్ లు పడుతూ, 20 ఓవర్లు అలా నడుం వంచి కీపింగ్ చేస్తూ ఎల్లకాలం తను ఒక్కడే ఆడగలడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read: పాక్ మాజీకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హర్భజన్

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిని ఓపెనింగ్ పంపించి, వాళ్లు అవుట్ అయితే ప్రమోషన్ పై రిషబ్ పంత్ ని పంపించడం సబబేనా? అని అడుగుతున్నారు. విరాట్ ని ఇలాగేనా వాడేదని అంటున్నారు. పవర్ ప్లే లో షాట్లు కొట్టక తప్పని పరిస్థితి ఉంటుంది. మెగా టోర్నమెంటులో అనవసర ప్రయోగాలు కరెక్ట్ కాదని అంటున్నారు.

ఇంకా టీమ్ ఇండియాలో స్పెషలిస్టు బ్యాటర్లు ఫామ్ లో రావడానికి ఎంత సమయం కావాలని కూడా నెటిజన్లు అడుగుతున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ ఒక్కడు 53 పరుగులు చేసి నాటౌట్ గా  నిలిచాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగి, మరొకరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ కల్పించాడు. ఇక ఐర్లాండ్ మ్యాచ్ లో కూడా 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు పాక్ పై 42 పరుగులు చేశాడు.

Also Read: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో భారత్.. ఏడో ప్లేస్‌లో పాకిస్థాన్..

ఇప్పటికైనా యూఎస్ఏ మ్యాచ్ కి రెస్ట్ ఇచ్చి కీపర్ కమ్ బ్యాటర్ గా స్టాండ్ బై లో ఉన్న సంజూ శాంసన్ ని తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సూపర్ 8లో రిషబ్ పంత్ అవసరం ఎంతో ఉందని సీనియర్లు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News