Xiaomi 15 : ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ టాప్ బ్రాండ్ తయారీ సంస్థ గ్జియోమీ ఇప్పటికే ఎన్నో మొబైల్స్ ను లేటెస్ట్ ఫీచర్స్ తో తీసుకొచ్చేసింది. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ మొబైల్ ను లాంచ్ చేయడానికి సిద్ధమైపోతుంది. ఈ నేపథ్యంలో గ్జియోమీ 15ను తీసుకురాబోతుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను తీసుకొచ్చే గ్జియోమీ త్వరలోనే మరో మొబైల్ ను తీసుకురాబోతుంది. గ్జియోమీ 15పేరుతో రాబోతున్న ఈ మెుబైల్.. కెమెరా ఫీచర్స్, ప్రాసెసర్ లీక్ అయ్యాయి. ఇందులో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, 200MP ప్రైమరీ షూటర్ ఉండనున్నట్లు తెలుస్తుంది.
Xiaomi 15 అల్ట్రా త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. తాజా డెవలప్‌మెంట్‌లో That Kartikey అనే టిప్‌స్టర్ Xiaomi 15 అల్ట్రా ఫోటోను లీక్ చేసింది. ఇందులో క్వాడ్ రియల్ కెమెరాతో ఈ మెుబైల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ముందు నుంచి ఈ కెమెరా ఫీచర్స్ అదిరిపోయే విధంగా ఉండనున్నట్టు టాక్ వినిపిస్తూనే వస్తుంది. ఈ సిరీస్ మొబైల్ కలర్ ఆప్షన్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయని.. బ్లాక్ కలర్ ఆప్షన్ లో స్మార్ట్ ఫోన్ రాబోతుందని తెలుస్తోంది.
ఈ మొబైల్ లో క్వాడ్ రియల్ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. లైకా బ్రాండింగ్‌తో పాటు నాలుగు సెన్సార్స్ మొబైల్లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో ఒక అంగుళాల టైప్ సెన్సార్ తో పాటు 200 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండే విధంగా గ్జియోమీ తీసుకువస్తున్న ఏకైక ఫ్లాగ్ షిప్ ఫోన్ అని సమాచారం. ఇక ఫోన్ బ్యాక్ ప్యానెల్ అద్భుతంగా ఉంటుందని… రౌండ్ ఎడ్జ్స్ తో గ్జియోమీ లోగో ఫోన్ కి వెనుక వైపున ఉండనుందని సమాచారం.
Xiaomi 15 Ultra Features And Specifications –
Xiaomi 15 Ultra మెుబైల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో పాటు హై కెపాసిటీ RAMతో రాబోతున్నట్లు తెలుస్తుంది. 6.73 ఇంచుల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే రాబోతున్నట్లు సమాచారం. ఇందులో మెమరీ ఇంటర్నల్ గా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ గ్యాడ్జెట్ హైపర్‌ఓఎస్‌లో పనిచేస్తుంది. అంతేకాకుండా, 200MP ప్రైమరీ షూటర్, 50MP టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ మెుబైల్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ మొబైల్ లో 5000mah బ్యాటరీతో 90w ఫాస్ట్ ఛార్జింగ్, 50w వైర్లెస్ ఛార్జింగ్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్లో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 69 లేదా ఐపీ 68 సర్టిఫికేషన్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఈ మొబైల్లో పవర్ హౌస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ లేటెస్ట్ ఫీచర్స్ తో తీసుకురాబోతున్న ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ : ఆండ్రాయిడ్, ఐఫోన్స్ లో వేర్వేరు ధరలు నిజమేనా! ఉబర్ ఏమంటుందంటే!