Uber : ఉబర్ (Uber) సంస్థపై గత కొన్ని రోజులుగా ఒక వాదన హల్చల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ (Android), ఐఫోన్ (iPhone) వినియోగదారులకు ఉబర్ వేరువేరుగా ధరలను చూపిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ విషయంపై ఒక వినియోగదారుడు ట్విట్టర్ (Twitter) వేదికగా తన అనుభవాన్ని వెల్లడించగా.. ఈ పోస్ట్ కు పలువురు మద్దతు తెలిపారు. దీంతో స్పందించిన కేంద్రం ఇలా ఎందుకు జరుగుతుందో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ ధరల ఛార్జీలపై ఉబర్ స్పందించింది.
ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉబర్ రైడ్ కి సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉంటున్నాయని ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. నిజానికి ఫోన్ చార్జింగ్ తక్కువ ఉన్న సమయంలో సైతం ఇలాంటి సమస్య తలెత్తుతుందని కస్టమర్ ఇబ్బందిని ఆసరాగా చేసుకుని ఉబర్ డబ్బులు సంపాదిస్తుందని మాటలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం కాస్త కేంద్రం వరకు వెళ్లడంతో ఉబర్ ప్రతినిధి స్పందించారు.
రైడర్ ఉపయోగించే ఫోన్ ధరను బట్టి ఉబర్ ధరలు నిర్ణయించదని తెలిపారు. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉబర్, ఓలా చూపే ధరల్లో వ్యత్యాసం ఉందని గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్లాట్ఫామ్ లో ఛార్జ్ వినియోగదారులు ఉపయోగించే మోడల్ బట్టి ఉండదు. అక్కడికి వెళ్లే సమయం, వినియోగదారుడు ఎంచుకొనే పికప్, డ్రాపింగ్ పొజిషన్ బట్టి ఉంటాయి. నిజానికి ఇలా ఎందుకు జరుగుతాయో మాకు కూడా క్లారిటీ లేదు. ఉబర్ సంస్థ ఎప్పటికీ వినియోగదారులకి సహాయం చేస్తూనే ఉంటుంది కానీ ఇబ్బంది కలిగించదు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
ALSO READ : చాట్ జీపీటీపై గ్లోబల్ పబ్లిషర్స్ దావా.. కంటెంట్ కాపీపై చేస్తుందంటూ ఆరోపణ
తాజాగా ఢిల్లీకి చెందిన ఇంజనీరింగ్ హబ్ అనే టెక్ ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్ నడుపుతున్న రిషిబ్ సింగ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. క్యాబ్ సర్వీస్ అందించే ఉబర్ సంస్థ ఫోన్లను బట్టి కాదు అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ బట్టి కూడా ఫేర్ లో వ్యత్యాసం చూపిస్తుందని తెలిపారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఓఎస్ డివైజెస్ వినియోగించి పరిశీలించినట్టు తెలిపారు. అన్ని డివైజెస్ లోను ఒకే అకౌంట్ తో లాగిన్ అయ్యి ఓకే ప్రదేశానికి రైడ్ బుక్ చేసినప్పటికీ ఫేర్ లో తేడా ఉందని తెలిపారు.
ఒకే విధమైన రైడ్‌ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాదనపై స్పందించిన కేంద్రం.. ఓలా (Ola), ఉబర్ (Uber) ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ తెలుపుతూ నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లకు నోటీసులు జారీ చేసింది. CCPA తన నోటీసులో కంపెనీలు తమ ధరల విధానాన్ని వివరించాలని, కస్టమర్స్ చెబుతున్న విషయాలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఓకే సమయంలో ఒకే చోటికి రైడ్ బుక్ చేస్తున్నప్పటికీ ఎందుకు ధరలు విషయంలో తేడాలు కనిపిస్తున్నాయి… పారదర్శకత లేకుండా డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు అనే విషయంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది.