BigTV English

TDP vs YCP: నిండా ముంచేశారు కదయ్యా.. ఏపీ భవిష్యత్ ఏమిటి?

TDP vs YCP: నిండా ముంచేశారు కదయ్యా.. ఏపీ భవిష్యత్ ఏమిటి?

TDP vs YCP: దావోస్ వెళ్లారు.. ఏం తెచ్చారు? వట్టి చేతులతో వచ్చారు. అసలెందుకు వెళ్లినట్లు? అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై వైసీపీ విమర్శల పర్వాన్ని సాగిస్తోంది. అయితే ఈ విమర్శలకు టీడీపీ సోషల్ మీడియా మాత్రం భిన్నరీతిలో తిప్పికొడుతోంది. అది కూడ ఆ గుడ్డు పాపం మీదేనంటూ.. వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తోంది. అసలు ఆ గుడ్డు కౌంటర్ వెనుక ఉన్న అసలు కథ ఇదేనని టీడీపీ విస్తృత ప్రచారం సాగిస్తోంది.


ఏపీలో గత ఐదేళ్లు వైసీపీ పాలన సాగింది. ఆ ఐదేళ్లు పెట్టుబడుల రాక ఏమో కానీ, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్ నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనపై మీడియా అడిగిన ప్రశ్నకు నాడు గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గుడ్డుతో పోల్చారు. గుడ్డు ఇప్పుడే పొడిగిందని, అప్పుడే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. దావోస్ లో మైనస్ 5 డిగ్రీల చలి ఉంటుందని, ఇప్పుడెలా వెళ్లాలంటూ కూడ అమర్ నాథ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ నే ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తోంది.

ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అడిగితే, గుడ్డు కథ చెప్పారు. ఆ ఐదేళ్లు ఒక్క పెట్టుబడి సాధించింది లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు ఐదేళ్లు ఒక్క కంపెనీ ముందుకు రాకపోగా, ఉన్న కంపెనీలు తెలంగాణకు వెళ్లాయని అప్పుడు లేని పెట్టుబడుల సాధన మాట ఇప్పుడు వినిపిస్తోందని వైసీపీ విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది.


రాష్ట్రానికి మూడు రాజధానులంటూ.. ఒక్క రాజధాని నిర్మించలేని పరిస్థితి. రాష్ట్రానికి రాజధాని తేల్చకుండ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తెచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీకి అవసరమైన ప్లానింగ్ లేకుండా.. పెట్టుబడిదారులను గందరగోళంలో పడేశారని, ఇప్పుడు ఇన్ఫాస్ట్రక్చర్ లేక.. పెట్టుబడులు రావడం ఏమో కానీ, ఆ రంగాన్ని అణగదొక్కారంటూ టీడీపీ ఫైర్ అవుతోంది.

పెట్టుబడుల సాధన పేరుతో వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పేరిట వచ్చిన కంపెనీలు ఏమయ్యాయని, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పిన మాటలు ప్రకటనకే పరిమితమయ్యాయా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. ఐదేళ్లు రాష్ట్రంలో పెట్టుబడుల ఊసే లేకుండ చేసి, నేడు దావోస్ కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ బృందంతో వెళితే వైసీపీ అవాకులు చవాకులు పేల్చడం తగదంటోంది టీడీపీ.

ఐదేళ్లు గుడ్డు పొదగలేదని కాలయాపన చేసిన వైసీపీకి, ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే పొదిగినట్లు కనిపించిందా అంటూ టీడీపీ తెగ ట్రోలింగ్ చేస్తోంది. అయితే దావోస్ పర్యటనలో 27 ప్రముఖ సంస్థల సీఈవోలు – అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల ఐదేళ్ల విధ్వంసంతో కోల్పోయిన పెట్టుబడిదారుల విశ్వాసంను తిరిగి పొందేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు దావోస్‌ వేదికగా ఏపీ బ్రాండ్‌ని మంత్రి నారా లోకేష్ అద్భుతంగా ప్రమోట్ చేశారని చంద్రబాబు పర్యటన గురించి వివరించారు.

Also Read: YS Sharmila on Vijayasai Reddy: సాయిరెడ్డి అసలు సత్యం చెప్పాలి.. వైఎస్ షర్మిళ డిమాండ్

భీకరమైన చలిని తట్టుకొని పెట్టుబడుల సాధన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే, అసలు దావోస్ ముఖమే చూడకుండ పెట్టుబడుల సాధనపై వైసీపీ నోరెత్తడం ఆశ్చర్యంగా ఉందంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తం మీద పెట్టుబడులు ఎక్కడ అంటూ ప్రశ్నించిన వైసీపీకి, దిమ్మతిరిగే రిప్లై టీడీపీ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×