Big Stories

BJP: కేవలం వాటి కోసమే రూ.100 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ..!

Google Ads: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరగడంతో అన్ని రకాల యాడ్స్ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలవ్వడంతో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియాలో ప్రటనలు చేస్తున్నాయి. అయితే గూగుల్‌లో యాడ్స్ కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసిన పార్టీగా బీజేపీ నిలిచింది.

- Advertisement -

గూగుల్‌లో రాజకీయ ప్రకటన కోసం బీజేపీ రూ. 100 కోట్లకు పైగా డబ్బును ఖర్చు చేసింది. మే 2018లో గూగుల్ యాడ్స్ ప్రారంభించినప్పటి నుంచి బీజేపీ డిజిటల్ ప్రచారాలకు రూ. 101 కోట్లకు పైగా ఖర్చు చేసింది. బీజేపీ చేసిన ఈ ప్రచార ఖర్చు అనేది.. కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), రాజకీయ సలహా సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) చేసిన ఖర్చుతో సమానం.

- Advertisement -

మే 31, 2018 నుంచి ఏప్రిల్ 25, 2024 మధ్య గూగుల్ యాడ్స్ కోసం బీజేపీ మొత్తం ఖర్చులో 26 శాతాన్ని దీనికే కేటాయించింది. ఆరేళ్లలో మొత్తంగా ప్రకటనలపై బీజేపీ రూ. 390 కోట్లు కేటాయించింది. గూగుల్ విషయానికొస్తే, ‘రాజకీయ’ ప్రకటనలు అంటే రాజకీయ పార్టీల ప్రకటనలు మాత్రమే కాదు. ఈ జాబితాలో న్యూస్ మీడియా, ప్రభుత్వ ప్రచార విభాగాలు, రాజకీయ నాయకులు, నటుల ప్రకటనలు ఉంటాయి.

గూగుల్ గణాంకాల ప్రకారం.. ఆరేళ్లలో 2 లక్షల 17 వేల 992 ‘రాజకీయ ప్రకటనలు’ వెలువడ్డాయి. అందులో 1లక్ష 61వేలు బీజేపీకి చెందినవే కావడం గమనార్హం. ఈ ప్రకటనల్లో బీజేపీ ఎక్కువగా కర్ణాటక వాసులను లక్ష్యంగా చేసుకుంది. కర్ణాటక నివాసితుల కోసం గూగుల్‌లో రూ.10.8 కోట్ల విలువైన ప్రకటనలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉంది. అక్కడి నివాసితుల కోసం రూ. 10.30 కోట్ల ప్రకటనలు బీజేపీ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (8.5 కోట్లు), ఢిల్లీ (7.6 కోట్లు) ఉన్నాయి. అయితే గూగుల్‌లో ఎక్కువగా తమిళనాడు నుంచి అత్యధిక రాజకీయ ప్రకటనలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

గూగుల్‌లో ‘రాజకీయ’ ప్రకటనలను ఉంచడంలో బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లలో రూ.45 కోట్ల విలువైన ప్రకటన చేసింది. గడిచిన ఆరేళ్లలో కాంగ్రెస్ మొత్తం 5,992 ప్రకటనలు ఇచ్చింది. కర్ణాటక, తెలంగాణను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ గూగుల్ యాడ్స్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల వాసుల కోసం కాంగ్రెస్ రూ.9.6 కోట్లు ఖర్చు చేసింది. మధ్యప్రదేశ్‌లో 6.3 కోట్లు ఖర్చు చేసింది.

కాంగ్రెస్ తర్వాత డీఎంకే పార్టీ గూగుల్‌లో ‘రాజకీయ ప్రకటనల’ పరంగా మూడవ స్థానంలో ఉంది. మే 2018 నుంచి, వారు గూగుల్‌లో ప్రకటనల ద్వారా 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందులో 16.6 కోట్ల రూపాయలను తమ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రచారం కోసం చేసింది. తమిళనాడు వెలుపల, ఎంకే స్టాలిన్ బృందం కార్నాట్‌లో రూ.14 కోట్లు, కేరళలో రూ.13 కోట్ల విలువైన ప్రకటను చేసింది.

నవంబర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రూ. 12 కోట్లను ప్రకటన కొరకు ఖర్చు చేసింది. బీఆర్ఎస్ రూ. 12 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ గూగుల్ యాడ్స్‌ కోసం రూ.4.8 కోట్లు ఖర్చు చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ యాడ్స్ కోసం రూ. 6.4 కోట్లు చేసింది.

రెండో విడత పోలింగ్ కోసం చేసిన ఖర్చులో బీజేపీను కాంగ్రెస్ పార్టీ వెనుకకునెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండో దశ ప్రచారంలో, రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో, విధానాలు, విజయాల ప్రచారం కోసం గూగుల్‌లోనే కనీసం రూ.14.7 కోట్లు ఖర్చు చేశాయి. రూ.5.7 కోట్లతో కాంగ్రెస్ తొలి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 18 మరియు ఏప్రిల్ 24 మధ్య గూగుల్‌లో ప్రకటన వ్యయంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచింది. బీజేపీ రూ.5.3 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జాతీయ పార్టీల తర్వాత ఏపీలోని వైసీపీ పార్టీ రెండో దశలో రూ.1.76కోట్లు కేటాయించి మూడో స్థానంలో నిలించింది.

Also Read: నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గూగుల్‌లో మూడవ అతిపెద్ద రాజకీయ ప్రకటనదారుగా ఉంది, దాని తరపున IPAC చెల్లించిన రూ. 6 లక్షలతో సహా రూ. 1.76 కోట్లు ఖర్చు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News