BigTV English

Virtual Dating:వర్చువల్‌గా డేటింగ్.. ఆ యాప్స్ ఉంటే చాలు..!

Virtual Dating:వర్చువల్‌గా డేటింగ్.. ఆ యాప్స్ ఉంటే చాలు..!

Virtual Dating:ఇప్పుడు ఏ వస్తువైనా.. క్షణాల్లో మన ముందు ఉండేలాగా టెక్నాలజీ ఏర్పడింది. దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడాలన్నా.. షాపింగ్ చేయాలన్నా.. అన్నీ వర్చువల్‌గానే జరిగిపోతున్నాయి. ఒక మనిషి ఒకచోటి నుండి మరొక చోటుకి ప్రయాణం చేయకుండానే తనకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ వర్చువల్‌గా ఉన్నట్టుగానే డేటింగ్‌ కూడా వర్చువల్‌గా చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నట్టు రీసెర్చ్‌లో తేలింది.


శాస్త్రవేత్తలు.. టెక్నాలజీతో ఒక సెపరేట్ వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించారు. అదే మెటావర్స్. మెటావర్స్‌లో ఇద్దరు మనుషులు దగ్గరగా లేకపోయినా.. దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అవ్వచ్చు. అంతే కాదు ఈ మెటావర్స్ సాయంతో శారీరికంగా ఒకచోట లేకపోయినా.. అక్కడకు వెళ్లిన అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం ఈ మెటావర్స్‌కు టెక్ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే చాలామంది ఈ మెటావర్స్‌నే తమ డేటింగ్ స్పాట్‌గా మార్చేసుకున్నారు.

తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. పురుషులలో 60 శాతం, మహిళలలో 48 శాతం మెటావర్స్‌లో వర్చువల్ డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది. మామూలుగా ఇండియాలో అరేంజ్ మ్యారేజ్ పద్ధతి ఎక్కువగా ఆచరణలో ఉంటుంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో డేటింగ్, రిలేషన్‌షిప్ అనేవాటిని ప్రోత్సహించరు. అలాంటి వారికి ఈ మెటావర్స్ బెటర్ ఆప్షన్‌లాగా కనిపిస్తోంది. ఇది తాము ఉండే చోటి నుండే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి సహాయపడుతుంది.


ముందుగా ఈ మెటావర్స్‌లో వ్యక్తులు తమ అవతార్‌ను క్రియేట్ చేసుకోవాలి. అంటే వారు ఎలా ఉంటారు, వాటి డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేవాటితో తమ ఏనిమేషన్ పిక్చర్‌ను క్రియేట్ చేయాలి. ఆ తర్వాత తమకు నచ్చిన అవతార్‌తో వర్చువల్‌గా బార్లు, క్లబ్స్, పార్కులు.. ఇలా ఎక్కడికైనా వర్చువల్‌గా వెళ్లిపోవచ్చు. మామూలుగా కొత్త మనుషులతో ఎక్కువగా కలవలేని వారికి కూడా ఈ మెటావర్స్ అడ్వాంటేజ్‌ను ఇస్తుంది.

ఒకరితో ఒకరు ఎదురెదురుగా కూర్చొని కలిసి మాట్లాడడానికి, వర్చువల్‌గా కలిసి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇలా కూడా కొత్త మనుషులతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం లభిస్తుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికీ చాలామందికి ఈ మెటావర్స్ డేటింగ్ గురించి అవగాహన లేకపోయినా.. ఇండియాలో ఈ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వర్చువల్ డేటింగ్ కోసం మెటావైబ్, మింగౌట్, స్వూన్ మీ లాంటి యాప్స్ మార్కెట్లో ఉన్నాయి.

Tags

Related News

Comet Browser: గూగుల్‌‌కే చెమటలు పట్టిస్తున్న ఈ అరవింద్ శ్రీనివాస్ ఎవరో తెలుసా? ఇదే భారతీయుడి పవర్!

Tablet Comparison: రెడ్మీ ప్యాడ్ 2 ప్రో vs వన్‌ప్లస్ ప్యాడ్ 3 vs శాంసంగ్ ట్యాబ్ S10 FE.. ఏ ట్యాబ్లెట్ బెస్ట్?

iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. రూ.10000 కంటే ఎక్కువ డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?

AI Dream Recorder: నిద్రలో వచ్చే కలలను వీడియోలుగా మార్చకోవచ్చు.. ఈ ఏఐ డివైజ్ గురించి తెలుసా?

Snapchat Memories: యూజర్లకు షాక్ ఇచ్చిన స్నాప్‌చాట్.. మెమొరీస్ స్టోరేజ్ ఇకపై ఫ్రీ కాదు

Oppo F29 Pro 5G: ఒప్పో ఎఫ్29 ప్రో 5జి సెన్సేషనల్ లాంచ్.. ఫోన్ లవర్స్ కోసం సూపర్ చాయిస్

Motorcycles: కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. స్పీడ్, స్టైల్.. కిక్ ఇచ్చే రైడ్, ఇంతకీ ఈ బైక్ ధర ఎంతో తెలుసా?

Samsung 5G Smartphone: సామ్‌సంగ్ కొత్త 5G ఫోన్.. అద్భుత ప్రీమియం డిజైన్‌తో లాంచ్

Big Stories

×