BigTV English

NTR Trivikram: ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ.. స‌రికొత్త జోన‌ర్‌

NTR Trivikram: ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ.. స‌రికొత్త జోన‌ర్‌

NTR Trivikram:యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని చెప్పింది ఎ వ‌రో కాదు.. నిర్మాత సూర్య దేవ‌ర నాగవంశీ. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌ని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే రొటీన్ ఫ్యామిలీ సినిమాలో, క‌మ‌ర్షియ‌ల్ సినిమానో చేయాల‌నుకోవ‌టం లేద‌ట‌. రొటీన్‌కి భిన్నంగా ఓ పౌరాణిక చిత్రం చేయ‌బోతున్నార‌ట‌. పౌరాణికంలో సినిమా అంటే చాలా ఉంటుంది. మ‌రి ఏ కాన్సెప్ట్‌తో త్రివిక్ర‌మ్ సినిమా చేస్తార‌నే దానిపై నాగ వంశీ క్లారిటీ ఇవ్వ‌లేదు.


కానీ మొత్తానికి త్రివిక్ర‌మ్ పౌరాణిక సినిమా చేయ‌బోతున్నార‌ని అనేది క‌న్‌ఫర్మ్‌. అది కూడా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అయితే అదెప్పుడ‌నే దానిపై మాత్రం నాగ వంశీ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని జోన‌ర్‌లో త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుంద‌నే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. మ‌రో వైపు ఎన్టీఆర్‌.. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇంకా కొర‌టాల శివ మూవీ స్టార్ట్ కానే లేదు. దీన్ని ఇంకా పూర్తి చేయ‌లేదు. దీని త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ సినిమా చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఏద‌నేది తెలుస్తుంది.

నిజానికి మ‌హేష్ సినిమా స్థానంలో ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ సినిమా చేయాల్సింది. ముందు అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. కానీ ఎందుక‌నో తెలియ‌ల‌దు. కానీ.. ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యింది. ఎన్టీఆర్ బ‌దులుగా త్రివిక్ర‌మ్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్నారు. అయితే నెక్ట్స్ మాత్రం త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబో మూవీ అది కూడా పౌరాణిక జోన‌ర్‌లో.


Related News

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Big Stories

×