YouTube new policy: ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. చక్కటి వీడియో కంటెంట్ ను క్రియేట్ చేసి.. దాని ద్వారా గుర్తింపు, ఆదాయం పొందుతున్నారు. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నది. క్వాలిటీ లేని వీడియోలకు చెల్లింపులు ఉండవని వెల్లడించింది. ఈ మేరకు కొత్త మానటైజేషన్ రూల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇంతకీ యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఏంటంటే?
క్వాలిటీ లేని వీడియోలకు నో పేమెంట్స్
యూట్యూబ్ తక్కువ శ్రమతో కూడిన, ప్రామాణికం కాని వీడియోల విషయంలో కఠిన చర్యలు తీసుకోనుంది. మాస్ ప్రొడక్ట్, బేస్ లెస్ కంటెంట్ కు యూట్యూబ్ లో చోటు లేదన్నారు. కొత్త మానటైజేషన్ రూల్స్ ప్రకారం క్రియేటర్స్ ఎల్లప్పుడూ అసలైన, ప్రమాణికమైన కంటెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 15 నుంచి మళ్లీ మళ్లీ అప్ లోడ్ అయ్యే కంటెంట్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసే రిపీటెడ్ వీడియోలను ఇకపై క్షుణ్ణంగా పరిశీలించనుంది. కొంత మంది ఒరిజినల్ కంటెంట్ మీద టెంప్లేట్ట్స్ వేసి వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. కొంత మంది AI సాధనాలను ఉపయోగించి రూపొందించబడిన వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది.
ఇకపై క్రియేటర్స్ తమ వీడియోలను సృష్టించడానికి AI సాధనాలపై ఎక్కువగా ఉపయోగించకూడదని యూట్యూబ్ వెల్లడించింది. కొంతమంది మల్టీఫుల్ వీడియోలతో వెబ్ సైట్ ను స్పామ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇది సాధారణంగా గేమింగ్ స్టైల్ ను కలిగి ఉంటుంది. దీనిలో కొంతమంది క్రియేటర్లు ఫేస్ లేని గేమింగ్స్ ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నారు. AI-జనరేటెడ్ వాయిస్‌లు, పాత్రలతో చాలా గేమ్ ప్లేను పోస్ట్ చేస్తున్నారు. అయితే, వీటి విషయంగో యూట్యూబ్ ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది.
ఇకపై ఆ వీడియోలు క్రియేట్ చేసే వారికి కష్టమే!
నిజానికి గత కొంత కాలంగా చాలా మంది AI వీడియోలను క్రియేట్ చేసి పోస్టు చేస్తున్నారు. కానీ, యూట్యూబ్ తాజాగా తీసుకొస్తున్న నిబంధనల్లో ఈ టైమ్ వీడియోల పట్ల కాస్త ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. అయితే, క్రియేటర్స్ ఆశ్రయించే కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన AI సాధనాల విషయంలో యూట్యూబ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు డబ్బు సంపాదించే AI-జనరేటెడ్ వీడియోలు ఇకపై యూట్యూబ్ లో అనుమతించబడకపోతే, జనాదరణ పొందిన AI సాధనాల కోసం, ముఖ్యంగా సృష్టికర్తలు వర్చువల్ అవతార్‌లు, ఆడియో, మరిన్నింటిని రూపొందించడంలో సహాయపడే వాటి కోసం యాక్టివ్ గా మెంబర్ షిప్ తీసుకునేవారికి ప్రోత్సాహాన్ని ఇవ్వదు. ఫలితంగా కొంత మంది యూజర్లు దూరమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: బీచ్ లో ఎప్పుడైనా కెరటాలు ఇలా కనిపిస్తే.. అస్సలు దిగొద్దు.. ఎందుకంటే?