King Cobra Video: ఇటీవల సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరలవుతున్నాయి. వర్షా కాలం ప్రారంభం కావడంతో పాములు బయట ఎక్కువగా సంచరిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో పాములకు సంబంధించిన ఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నా.. వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫారెస్ట్ అధికారి పరవీన్ కస్వాన్ భారీ కింగ్ కోబ్రాను ఎలాంటి భయం బెరుకు లేకుండా చేతులతో పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పరవీన్ కస్వాన్ 11 సెకన్ల పాటు ఆ భారీ పామును నిర్భయంగా పట్టుకుని ఉన్నాడు. ఈ పాము భారీ పరిమాణం చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. పరవీన్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘కింగ్ కోబ్రా అసలైన పరిమాణం గురించి మీరు ఆలోచించారా? ఇది భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? దీనిని చూసినప్పుడు ఏమి చేయాలి?’ అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పం. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడుగు వరకు పెరుగుతుంది. ఇది ఆగ్నేయాసియా అడవుల్లో, ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ ఘాట్స్, తూర్పు ఘాట్స్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుంది. దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
కింగ్ కోబ్రాలు తమ గంభీరమైన రూపం, అత్యంత విషంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వీడియోలో వ్యక్తి ధైర్యం, పామును పట్టుకునే నైపుణ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు అతని ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన సంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.
If you ever wondered about the real size of King cobra. Do you know where it is found in India. And what to do when you see one !! pic.twitter.com/UBSaeP1cgO
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 8, 2025
ALSO READ: RCFL: పదితో ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జీతమైతే అక్షరాల రూ.55,000
ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. ‘నేను అడవిలో నిజమైన కోబ్రాను చూశాను. దాని హిస్ హిస్ అనే శబ్దం భయానకంగా ఉంది. ఆ రాత్రి నిద్రపోలేదని రాసుకొచ్చాడు. మరొకరు ‘పశ్చిమ ఘాట్స్‌లో ఒక కోబ్రాను చూశాను.. ఈ పాములతో జాగ్రత్తగా ఉండాలి. కింగ్ కోబ్రాలకు దూరం పాటించడం ఉత్తమం’ అని సలహా ఇచ్చారు.
ALSO READ: Python Video: పొలంలో కదలలేని స్థితిలో భారీ కొండచిలువ.. డౌట్ వచ్చి పొట్టను చీల్చి చూడగా..!
ఈ వీడియో భారతదేశ వన్యప్రాణుల అందం, ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తుంది, అయితే ఇలాంటి పాములతో అధికారులైనా, స్నేక్ క్యాచర్ లు అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కింగ్ కోబ్రా ఒక గొప్ప జీవి. కానీ దాని విషం అత్యంత ప్రమాదకరం. ఈ వీడియో సర్పాల గురించి అవగాహన పెంచడంతో పాటు, వాటిని గౌరవించాలని, సురక్షిత దూరం నుండి వీక్షించాలని తెలియజేస్తుంది.