Blinkit Delivery Boy : సాధారణంగా క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా క్రికెట్ ని అన్ని రంగాల వారు ఆడుతుంటారు. చిన్న పిల్లల వద్ద నుంచి జాబర్స్ వరకు ఏదో ఒక సందర్భంలో క్రికెట్ ఆడుతుంటారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో క్రికెట్ ని ఆడుతుంటారు. భారత్ లో అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవ్వరైనా క్రికెట్ ఆడుతుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా రకరకాలుగా వారికి అనుకూలంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ ఆటకి వయస్సు తో అస్సలు సంబంధం ఉండదు. ఎవ్వరైనా సరే ఆడుతుంటారు. కొందరూ దారిన పోయే వారు కూడా తనకు ఇష్టమైన క్రికెట్ ఆడాలని వారికి తెలిసిన వారితో రెండు బంతులు ఆడుతానని బ్యాటింగ్ చేస్తుంటారు.
Also Read : Yash Dayal : ఆమెకు ఐఫోన్.. లక్షల్లో డబ్బు కూడా ఇచ్చా.. నాకే ద్రోహం చేసింది
క్రికెట్ ఆడిన బ్లింకిట్ డెలివరీ బాయ్..
ఇలా నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మనకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి కూడా. తాజాగా ఓ బ్లింకిట్ డెలివరీ బాయ్ సామాగ్రి డెలివరీ చేసేందుకు వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడుతుంటే తాను బ్యాటింగ్ చేస్తానని బ్యాటింగ్ చేశాడు. బయట తిరిగే వాడికి మరీ బ్యాటింగ్ ఇచ్చారు ఆ గల్లీ క్రికెటర్లు. దీంతో 4 బంతులు ఎదుర్కొన్న డెలివరీ బాయ్.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. తన బ్యాట్ తో బంతులను ఆపాడు. క్రికెట్ చాలా బాగా ఆడుతున్నావని అక్కడ క్రికెట్ ఆడుతున్న వారు అతన్ని పొగిడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి క్రికెట్ అంటే కేవలం ఆట కాదు.. ఒక ఎమోషన్ అంటే ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ని ఎక్కడ పడితే అక్కడ నిత్యం ఏదో ఒక చోట ఆడుతూనే ఉన్నారు.
పొగడ్తలతో ముంచెత్తిన నెటిజన్లు..
ఇక Blinkit డెలివరీ బాయ్ అనే అతను ఒక సొంత కాంట్రాక్టర్ అనే చెప్పవచ్చు. ఇక Blinkit యాప్ ఉపయోగించి కస్టమర్లకు కిరాణా సామాగ్రి, తదితర వస్తులను డెలివరీ చేస్తారు. వారు సొంత ద్విచక్ర వాహనాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులో డెలివరీ భాగస్వామి కావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ద్విచక్ర వాహనం, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బీమా, పాన్ కార్డు వంటి అవసరమైన పత్రాలు కూడా కలిగి ఉండాలి. ప్రస్తుతం ప్రముఖ నగరాల్లో డెలీవరీ చేసే యాప్ లలో Blinkit ఒకటి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఫేమస్ గా మారింది. ప్రస్తుతం బ్లింకిట్ నిత్యం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఢిల్లీ కి చెందిన ఓ వ్యక్తి బ్లింకిట్ డెలివరీ తనను కలవర పెట్టిందని.. డెలివరీ ఏజెంట్ తన వ్యక్తిగత సమాచారన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ద్వారా బెదిరించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్ ఇష్ట పూర్వకంగానే క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.
Cricket isn't just game It's Emotion❤️🩹🤌 pic.twitter.com/4iNVZsY9cc
— Aditya Tiwari ❤️👻 (@aditiwari9111) July 8, 2025