Big Tv Live Originals: సముద్ర పరిసర ప్రాంత ప్రజలకు రిప్ కరెంట్ గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. సముద్రంలో బలమైన, ఇరుకైన నీటి ప్రవాహాలను రిప్ కరెంట్ అంటారు. ఇంకా చెప్పాలంటే తీరం నుంచి ఒక వస్తువును లేదా మనుషులను అత్యంత బలంగా లోపలికి లాగే అవకాశం ఉంటుంది. అలలు నీటిని బీచ్ వైపు నెట్టినప్పుడు ఇవి ఏర్పడుతాయి. రిప్ కరెంట్ ఎప్పుడు ఏర్పడుతుంది? దానిలో చిక్కుకుంటే ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రిప్ కరెంట్ లు ఎందుకు ప్రమాదకరం?
రిప్ ప్రవాహాలు అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. గజ ఈతగాళ్లను సైతం ఒడ్డుకు రాకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంటుంది. ఎందుకంటే..
⦿ అత్యతం వేగంగా కదులుతాయి: రిప్ ప్రవాహాలు చాలా వేగంగా కదులుతాయి. సెకనుకు 8 అడుగుల వరకు వెళ్తుంది. ఇవి ఒలింపిక్ ఈతగాళ్ల కంటే వేగంగా కదులుతాయి.
⦿భయాందోళనకు కారణమవుతాయి: ఇవి చుట్టుముట్టినప్పుడు ఈత గాళ్ళు తమను తాము సముద్రంలోకి లాగుతున్నట్లు భావిస్తారు. భయాందోళనకు గురవుతారు. ఈ సమయంలో ఆలోచిండం మానేస్తారు. ఎలా ఈత కొట్టాలో తెలియక అయోమయానికి గురవుతారు.
⦿ వెంటనే అలసిపోయేలా చేస్తాయి: రిప్ అలల నుంచి తప్పించుకునేందుకు నేరుగా ఈత కొట్టడం వల్ల ఈజీగా అలసిపోతారు. నీటి మీద తేలేందుకు కష్టపడుతారు. ప్రశాంత సమయంలోనూ రిప్ ప్రవాహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
రిప్ కరెంట్‌ను ఎలా గుర్తించాలి?
రిప్ ప్రవాహాలను గుర్తించడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ అలలు విరిగిపోయినట్లు గా కనిపిస్తాయి. అలల మధ్య ప్రశాంతమైన నీటి స్ట్రిప్ ఉంటుంది.
⦿ చుట్టుపక్కల ప్రాంతం కంటే ముదురు లేదా చీకటిగా నీటి రంగు కనిపిస్తుంది.
⦿ నురుగు లేదంటే కింద ఉన్న వస్తువులు సముద్రంలోకి లాగుతున్నట్లు కనిపిస్తాయి.
⦿ నీరు భిన్నంగా ప్రవహిస్తున్నట్లు కనిపించే అలలలో ఖాళీ ప్రదేశాలు కనిపిస్తాయి.
రిప్ అలల్లో చిక్కుకుంటే ఏం చేయాలి?
ఒకవేళ రిప్ కరెంట్‌లో చిక్కుకుంటే, ముందుగా ప్రశాంతంగా ఉండాలి. ఆ తర్వాత ఈ స్టెప్స్ ఫాలోకండి.
⦿ రిప్ అలల్లో చిక్కినప్పుడు నేరుగా ఒడ్డుకు వచ్చేందుకు ఈత కొట్టవద్దు. అలా చేసే ఈజీగా అలసిపోతారు.
⦿ రిప్ అలల నుంచి తప్పించుకునేందుకు అలలకు పక్కవైపు ఈత కొట్టాలి.
⦿ మీరు ఈత కొట్టలేకపోతే, శక్తిని ఆదా చేసుకునేందుకు వెల్లికిలా పడుకుని తేలేందుకు ప్రయత్నించాలి.
⦿ లైఫ్ గార్డ్ కోసం చేతులు ఊపాలి.
బీచ్ లో సేఫ్ గా ఎలా ఉండాలి?
రిప్ అలల బారినపడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.
⦿ లైఫ్ గార్డ్‌ల తో బీచ్‌లలో ఈత కొట్టండి. వారు రిప్ కరెంట్‌లను గుర్తిస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉంటే సాయం చేస్తారు.
⦿ నీటిలోకి ప్రవేశించే ముందు రిప్ అలల గురించి హెచ్చరికలను పరిశీలించండి.
⦿ఒంటరిగా ఈత కొట్టకండి. మీతోపాటు ఫ్రెండ్స్ లేదంటే కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.