Power Bank Offer: టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న కొద్దీ, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి గాడ్జెట్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే, దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీ తగ్గిపోయి, ఛార్జింగ్ లేక అనేక మంది ఇబ్బందులు పడతారు. అలాంటి వారికి పవర్ బ్యాంక్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
తక్కువ ధరలో
ఇప్పటికే అనేక మంది వీటిని ఉపయోగిస్తుండగా, తాజాగా జెబ్రానిక్స్ (Zebronics) నుంచి కొత్తగా MB10000S4 పవర్ బ్యాంక్ విడుదలైంది. ఇది అత్యధిక సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్, పోర్టబుల్ డిజైన్ కలిగి ఉండే ఈ పవర్ బ్యాంక్ తక్కువ ధరకే లభిస్తోంది. మొత్తంగా, Zebronics MB10000S4 పవర్ బ్యాంక్ తక్కువ ధరలో ఉత్తమమైన పనితీరును అందించడంతోపాటు, వేగవంతమైన ఛార్జింగ్, డ్యూయల్ అవుట్‌పుట్, మల్టిపుల్ పోర్ట్ ఆప్షన్‌లు, డిజైన్ వంటి లక్షణాలను అందిస్తోంది.
Zebronics MB10000S4 పవర్ బ్యాంక్ ప్రధాన ఫీచర్లు
10000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ పవర్ బ్యాంక్‌లో 10000 mAh సామర్థ్యం గల లిథియం-పాలిమర్ బ్యాటరీ ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది సాధారణంగా ఫోన్‌ను కనీసం 2 నుంచి 3 సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా ట్రావెల్ సమయంలో బ్యాటరీ డ్రెయిన్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
Read Also: Best 5g Phones Under 10000: రూ. 10 వేల బడ్జెట్ లోపు టాప్
డ్యూయల్ USB అవుట్‌పుట్
Zebronics MB10000S4 పవర్ బ్యాంక్‌లో డ్యూయల్ USB అవుట్‌పుట్ ఉంది. అంటే మీరు ఒకేసారి రెండు డివైస్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీని అవుట్‌పుట్ పవర్ 12W వరకు ఉండటంతో వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తుంది.
Type-C, మైక్రో USB ఇన్‌పుట్
ఈ పవర్ బ్యాంక్ టైప్-C (Type-C), మైక్రో USB (Micro USB) ఇన్‌పుట్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు అందుబాటులో ఉన్న ఛార్జింగ్ కేబుల్‌తో పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
శక్తివంతమైన ప్రొటెక్షన్ ఫీచర్లు
ఓవర్‌ఛార్జింగ్ ప్రొటెక్షన్ – ఎక్కువ ఛార్జింగ్ వల్ల బ్యాటరీకి నష్టం కలగకుండా కాపాడుతుంది.
ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ – పవర్ బ్యాంక్ వేడెక్కకుండా కంట్రోల్ చేస్తుంది
షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ – పొరపాటుగా షార్ట్ సర్క్యూట్ అయితే, పవర్ బ్యాంక్ స్వయంగా ఆఫ్ అవుతుంది.
ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ – అధిక కరెంట్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
పవర్ చూపించే LED డిస్‌ప్లే
పోర్టబుల్, స్టైలిష్ డిజైన్
Zebronics MB10000S4 పవర్ బ్యాంక్‌లో పవర్ స్థాయిని చూపించే LED డిస్‌ప్లే ఉంది. ఇది ఎంత ఛార్జ్ ఉందో స్పష్టంగా చూపిస్తుంది. ఇలా ఉండటం వల్ల ఛార్జింగ్ స్థాయిని ముందుగా గమనించుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ కాంపాక్ట్‌గా ఉండటంతోపాటు చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు దీనిని జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ పవర్ బ్యాంక్ భారతదేశంలో తయారైంది. దీని అసలు ధర రూ. 1,699 కాగా, 71% తగ్గింపుతో అమెజాన్లో ప్రస్తుతం రూ. 499కి అందుబాటులో ఉంది.