Suryakumar Yadav – MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో..ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్ధిక్ పాండ్యా గా ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ హర్ధిక్ పాండ్యా పై వేటు పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ఆడే మొదటి మ్యాచ్ కు హర్ధిక్ పాండ్యా దూరం కానున్నాడు. గత సీజన్ లో చోటు చేసుకున్న పెనాల్టీ కారణంగా ముంబై ఇండియన్స్ ఆడే మొదటి మ్యాచ్ కు హర్ధిక్ పాండ్యా దూరం కానున్నాడు. దీంతో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఆడే మొదటి మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు.
Also Read: SRH Players: కూకట్ పల్లి క్లాసెన్, జూపార్క్ జంపా…SRH ప్లేయర్ల పేర్లు అదరహో !
ఈ మేరకు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో… సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి ప్లేయర్లు కూడా ఆడాల్సి ఉంది. అయితే… ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ…. సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) అవకాశం ఇవ్వడానికి వెనుక కారణం లేకపోలేదు. సూర్యకుమార్ యాదవ్ టీ20 మ్యాచ్ లో అద్భుతంగా ఆడతాడు. టీమిండియా టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. ఇటీవలే.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ జరిగింది. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే… టీమిండియా సిరీస్ గెలిచింది.
అటు.. 360 డిగ్రీస్ యాంగిల్ బ్యాటింగ్ చేసి… మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. అందుకే… ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ…. సూర్యకుమార్ యాదవ్ అవకాశం ఇచ్చింది అంబానీ ఫ్యామిలీ. మరి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుందో చూడాలి. ఇక అటు… ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్ధిక్ పాండ్యా స్పందించారు. తన జట్టులో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లాంటి కెప్టెన్లతో పాటు… సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్ గా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించారు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్ధిక్ పాండ్యా. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళతానని ప్రకటించాడు పాండ్యా. ఇది ఇలా ఉండగా…. ముంబై ఇండియన్స్ జట్టు తన మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. మార్చి 23 వ తేదీన అంటే ఆదివారం రోజున సాయంత్రం 7:30 గంటలకు ఉండనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ చెన్నైయ్ వేదికగా జరుగనుంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు..కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్ రద్దు ?
Not Rohit Sharma but Suryakumar Yadav will lead Mumbai Indians during their IPL 2025 opener 🏏#RohitSharma #SuryakumarYadav #HardikPandya #MI #IPL2025 #Indiancricket #Insidesport #CricketTwitter pic.twitter.com/SwEhjDRUbE
— InsideSport (@InsideSportIND) March 19, 2025