Best bluetooth soundbar under 1000: ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నా.. నచ్చిన పాటలు వింటున్నా బేస్ అదిరిపోవాలి.. సౌండ్ క్లారిటీగా ఉండాలి. కానీ.. బడ్జెట్ మాత్రం రూ.1000 లోపే ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే మార్కెట్లోకి వచ్చేసింది ZEBRONICS Zeb-Vita Pro 24W Bluetooth Soundbar! కేవలం రూ. 999 ధరకే లభించే ఈ పోర్టబుల్ సౌండ్‌బార్ ఫీచర్లు, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఈ ప్రైస్ రేంజ్‌లో 5W లేదా 10W స్పీకర్లు మాత్రమే వస్తుంటాయి. కానీ జెబ్రోనిక్స్ ఇందులో ఏకంగా 24W అవుట్‌పుట్‌ను ఇచ్చింది. దీని వల్ల సౌండ్ చాలా లౌడ్‌గా, బేస్ పంచ్‌గా ఉంటుంది. చిన్న రూమ్స్ లేదా హాల్‌లో సినిమా చూసేటప్పుడు ఇది ఒక చిన్న థియేటర్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది.
ఈ సౌండ్‌బార్ చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది. టీవీ కింద లేదా కంప్యూటర్ టేబుల్ మీద పెడితే చాలా క్లాసిక్‌గా సెట్ అయిపోతుంది. దీని ముందు భాగంలో ఒక స్మార్ట్ ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఇది ఏ మోడ్‌లో ఉందో, వాల్యూమ్ ఎంతుందో క్లియర్ గా చూపిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్‌లో డిస్ప్లే ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
జెబ్రోనిక్స్ విటా ప్రోలో కనెక్టివిటీకి ఎలాంటి ఢోకా లేదు.
Bluetooth v5.0: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలకు చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతుంది.
USB & Micro SD కార్డ్: పెన్‌డ్రైవ్ లేదా మెమరీ కార్డ్ పెట్టి డైరెక్ట్‌గా పాటలు వినొచ్చు.
AUX Input: బ్లూటూత్ లేని పాత డివైజ్‌లను కూడా వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
Built-in FM Radio: బోర్ కొట్టినప్పుడు రేడియో వినే ఆప్షన్ కూడా ఉంది.
Also Read: బట్టలు తళతళలాడాల్సిందే.. నీళ్లు సేవ్ అవ్వాల్సిందే! మీ కోసం బెస్ట్ వాషింగ్ మెషీన్లు
పాటలు వినేటప్పుడు ఫోన్ వస్తే.. పదే పదే డిస్‌కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.దీనిలోని ఇన్-బిల్ట్ మైక్ సహాయంతో సౌండ్‌బార్ ద్వారానే హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వాయిస్ క్లారిటీ కూడా బాగుంటుంది.
ఇది ఒక పోర్టబుల్ వైర్‌లెస్ సౌండ్‌బార్ కాబట్టి, రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీడియం వాల్యూమ్‌లో దాదాపు 10 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ట్రావెలింగ్ కి లేదా చిన్న చిన్న గెట్-టుగెదర్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్ పార్ట్నర్.
మీ బడ్జెట్ కచ్చితంగా రూ. 1,000 లోపే ఉండి, మీ ఫోన్ లేదా టీవీ సౌండ్ పెంచడానికి ఒక మంచి బ్రాండెడ్ స్పీకర్ కావాలనుకుంటే.. ZEBRONICS Zeb-Vita Pro 24W బెస్ట్ ఛాయిస్. మ్యూజిక్ లవర్స్ , మూవీ లవర్స్ ఇద్దరికీ ఇది వంద శాతం వర్త్ బయింగ్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు.