E-Paper
Advertisement

షావోమి నుంచి సూపర్ QLED స్మార్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

షావోమి నుంచి సూపర్ QLED స్మార్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Xiaomi X Pro QLED 55-Inch: సినిమా థియేటర్ వైబ్స్ ఇంట్లోనే కావాలనుకుంటున్నారా? పైగా బడ్జెట్ లోపు కావాలనుకుంటున్నారా? అయితే మీకోసమే షావోమి సరికొత్త విజువల్ వండర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే Xiaomi X Pro QLED 2025 (55-Inch) స్మార్ట్ టీవీ. కేవలం నార్మల్ ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో బోర్ కొట్టిన టెక్ ప్రియుల కోసం ప్రీమియం QLED డిస్‌ప్లేను అందుబాటు ధరలో అందిస్తోంది షావోమి. అదిరిపోయే డిజైన్, మెస్మరైజింగ్ కలర్స్, థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్‌తో వస్తున్న ఈ 55 ఇంచుల స్మార్ట్ టీవీ ఫీచర్లు, ఇండియాలో దీని ధర ఎంత? ఇది నిజంగానే వర్త్ ఆ కాదా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షావోమి 55 ఇంచుల QLED రివ్యూ:

టీవీ రంగంలో వన్-ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా ఎదిగిన షావోమి (Xiaomi), తన సరికొత్త 2025 ఎడిషన్ X Pro QLED మోడల్‌తో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా 55 ఇంచుల స్క్రీన్ సైజ్ అనేది ఈ రోజుల్లో ప్రతి మిడిల్ క్లాస్ లివింగ్ రూమ్‌కి ఒక పర్ఫెక్ట్ లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఈ టీవీని స్పెషల్ గా మార్చే ఆ టాప్ ఫీచర్లు ఇవే..

Advertisement

1. విజువల్స్ అదిరిపోయే QLED డిస్‌ప్లే :

సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే క్యూఎల్ఈడీ టెక్నాలజీ వేరే లెవెల్ విజువల్స్ ఇస్తుంది. ఇందులో.. రంగులు చాలా నేచురల్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు HDR10+ సపోర్ట్ ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి సీన్ థియేటర్ ఎఫెక్ట్‌ను గుర్తుచేస్తుంది. బెజెల్-లెస్ డిజైన్ వల్ల స్క్రీన్ మరింత పెద్దగా, ప్రీమియంగా కనిపిస్తుంది.

Advertisement

2. స్మార్ట్ గూగుల్ టీవీ అండ్ ప్యాచ్‌వాల్ :
ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్‌తో రన్ అవుతుంది. దీని వల్ల మీకు నచ్చిన యాప్స్, సలహాలు హోమ్ స్క్రీన్‌పైనే చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. దీనితో పాటు షావోమి సిగ్నేచర్ ఫీచర్ అయిన ‘ప్యాచ్‌వాల్’ కూడా ఉంది. ఇది ఇండియాలోని లోకల్ కంటెంట్, ట్రెండింగ్ సినిమాలు, స్పోర్ట్స్‌ను స్మార్ట్‌గా రికమండ్ చేస్తుంది. కిడ్స్ మోడ్ కూడా ఉండటం వల్ల పిల్లలకు సేఫ్ కంటెంట్ మాత్రమే చూపించవచ్చు.

3. థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ :
సినిమాకి విజువల్ ఎంత ముఖ్యమో.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. ఇందులో 30 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లు ఇచ్చారు. ఇవి డాబ్లే ఆడియో, DTS-X టెక్నాలజీతో పని చేస్తాయి. దీనివల్ల విడిగా హోమ్ థియేటర్ లేకపోయినా రూమ్ మొత్తం సౌండ్ రీసౌండ్ వస్తుంది. డైలాగ్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది.

Also Read: బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి

4. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ & కనెక్టివిటీ:
ఈ టీవీలో పవర్‌ఫుల్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. 2GB ర్యామ్ , 32GB స్టోరేజ్ ఇవ్వడం వల్ల ఎలాంటి లాగ్స్ లేకుండా యాప్స్ చాలా స్పీడ్‌గా ఓపెన్ అవుతాయి. గేమింగ్ ప్రియుల కోసం ఆటో లో-లేటెన్సీ మోడ్ ఉంది. 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ధర ?
మార్కెట్లో.. Xiaomi X Pro QLED 2025 (55-Inch)స్మార్ట్ టీవీ లాంచ్ ధర సుమారు రూ. 34,999 నుంచి రూ. 37,999 మధ్య అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ , మీ హోమ్ స్టోర్స్‌లో క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో దీనిని ఇంకా తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో క్యూఎల్ఈడీ స్క్రీన్ దొరకడం అంటే సూపర్ డీల్ అనే చెప్పాలి.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×