Khammam District: శీతాకాలం వేళ రోడ్డు ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మంగళవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అరడజను ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది మరణించారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాంటి ఘటన జరిగింది.
ఏపీ, తెలంగాణలో మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో రహదారులు రక్తసిక్తమయ్యాయి. విజయనగరం, కడప, పల్నాడు, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చేసుకున్నాయి. అసలే శీతాకాలం కావడంతో ప్రమాదాలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా వైరాలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కిషోర్ రెడ్డి-లావణ్య ఫ్యామిలీ అన్నవరం వెళ్లింది. అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుని తిరుగు హైదరాబాద్‌కు బయలుదేరారు.
వారు ప్రయాణిస్తున్న కారు, ఖమ్మం జిల్లా వైరాలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న ఓ లారీ గ్రీన్ ఫీల్డ్ ఎగ్జిట్ వద్ద కిషోర్ రెడ్ది కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కిషోర్ రెడ్డి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిషోర్ కొడుకుని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతుల దుర్మరణం
ఖమ్మం జిల్లా వైరా మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కోట కిషోర్ రెడ్డి, లావణ్య దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నవరం దర్శనం ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.… pic.twitter.com/yrbYNZ3yGL
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2026
హయత్‌నగర్‌లో మైనర్ రాష్ డ్రైవింగ్.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని కుంట్లూరులో ఓ మైనర్ బాలుడు బైక్‌తో రాష్ డ్రైవింగ్ చేస్తూ ముగ్గురిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు… pic.twitter.com/XhvZfXvBc4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2026