DADA : టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఒక్కొక్కరు పోటీపడి మరి వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా తమ వరస ప్రాజెక్టులను ప్రకటిస్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీనిస్తూ వస్తున్నారు.. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలయ్య కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆయన ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆ సినిమానే ‘దాదా’.. ఆ మూవీ రిలీజ్ డేట్ పై ఒక వార్త బయటకొచ్చింది. దాంతో ఫాన్స్ టెన్షన్ పడిపోతున్నారు మరి ఈ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా? లేదా?అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలయ్య, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దాదా’.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు యావరేజ్ టాక్ ని అందుకోవడంతో బాలయ్య ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలుసు. డిసెంబర్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ముందుగా మేకర్స్ డేట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ డేట్ కి వస్తుందా? రాదా అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్నాయి. ఫస్ట్ సింగిల్ తర్వాత ఈ సినిమా గురించి ఎటువంటి చడి చప్పుడు లేకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పెద్ది నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాయి అని చెప్పాలి. మాస్ రాంపేస్తే రాబోతున్న ఈ సినిమా కోసం మాస్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బాలయ్య ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లు కనిపించబోతున్నాడని ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. మరి ఈ మూవీలో బాలయ్య ఎలాంటి స్టోరీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా గురించి పూర్తి విషయాలు తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Kummestham!!! No doubt 🔥🔥
DECEMBER 24th date gurthu pettukondi – it will be a celebration 💯#DADA https://t.co/PnRTZN1ZWC
— DADA (@NBKisDADA) November 23, 2026
Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై మనోజ్ కు డౌట్.. బాలు ఏడ్పించేసాడు.. పాపం మీనా..