E-Paper
Advertisement

వాషింగ్ మిషన్ డోర్ తెరిచి ఉంచితే.. ఎంత లాభమో తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!

వాషింగ్ మిషన్ డోర్ తెరిచి ఉంచితే.. ఎంత లాభమో తెలుసా? ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యారు!
Advertisement

Washing Machine: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సీజన్‌లో బట్టలు ఉతకడం ఒక ఎత్తయితే, వాటిని ఆరబెట్టడం, వాషింగ్ మెషిన్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడం మరో పెద్ద టాస్క్. చాలామంది బట్టలు ఉతికిన వెంటనే వాషింగ్ మిషన్ డోర్‌ను గట్టిగా మూసేస్తుంటారు. అయితే కొద్ది గంటల పాటు ఆ డోర్‌ను తెరిచి ఉంచడం వల్ల ఎన్నో రకలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మిషన్ మన్నికగా ఉండటంతో పాటు ఖరీదైన దుస్తులు పాడవకుండా ఉంటాయని పేర్కొంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

డోర్ తెరిస్తే ఏంటి లాభం?

బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ డ్రమ్‌ లోపల, రబ్బర్ గ్యాస్కెట్ చుట్టూ కొంత నీరు, తేమ నిలిచిపోతాయి. బట్టలు తీసేసిన వెంటనే డోర్ మూసేయడం వల్ల ఆ తేమ లోపలే ఉండిపోతుంది. దీనివల్ల మిషన్ లోపల దుర్వాసన రావడం, బూజు పట్టడం మొదలవుతుంది. ఆ తర్వాత మనం ఎంత మంచి డిటర్జెంట్ వాడినా.. బట్టలు ఉతికాక వాటి నుంచి ఒక రకమైన కుళ్లిన వాసన వస్తుంది. అదే ఉతికిన తర్వాత 2-3 గంటల పాటు మిషన్ డోర్‌ను కాస్త తెరిచి ఉంచితే లోపలి గాలి బయటకు వెళ్లి డ్రమ్ పూర్తిగా ఆరిపోతుంది. ఇది బ్యాక్టీరియా చేరకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. .

తేమ ఎందుకు పెరుగుతుంది?

Advertisement

వర్షాకాలంలో వాతావరణంలో ‘హ్యుమిడిటీ’ లేదా ఆర్ద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. గాలిలో అప్పటికే నీటి ఆవిరి ఎక్కువగా ఉండటం వల్ల మిషన్ లోపల ఉన్న తడి అంత సులభంగా ఆవిరి కాదు. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, బూజు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో సాధారణ రోజుల కంటే చాలా వేగంగా మిషన్ లోపల మురికి, దుర్వాసన పేరుకుపోతాయి.

Also Read: రూ.448 vs రూ.548.. సామాన్యుల కోసం జియో, ఎయిర్‌టెల్ బడ్జెట్ ప్లాన్స్!

ఈ జాగ్రత్తలు కూడా మస్ట్!

Advertisement

బట్టలు ఉతికిన తర్వాత మిషన్ డోర్ తెరవడమే కాకుండా కొన్ని జాగ్రత్తలు సైతం తీసుకుంటే ఇంకా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. డోర్ తో పాటు డిటర్జెంట్, కంఫర్ట్ వేసే ‘డిటర్జెంట్ ట్రే’ను కూడా కొద్దిగా బయటకు లాగి ఉంచాలని సూచిస్తున్నారు. రెండింటినీ కనీసం 2 నుండి 3 గంటల పాటు ఓపెన్‌గా ఉంచడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ లోడ్ మిషన్ వాడేవారు ప్రతి వాష్ తర్వాత డోర్ చుట్టూ ఉండే రబ్బర్ రింగ్ లోపలి భాగాన్ని పొడి గుడ్డతో తుడవాలని హితవు పలుకుతున్నారు. అలాగే నెలకు ఒకసారైనా టబ్ ను క్లీన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మిషన్ మన్నికగా ఉండటంతో పాటు బట్టలు వాసన రాకుండా సువాసనలు వెదజల్లుతాయని వివరిస్తున్నారు.

Also Read: జియో ధమాకా ఆఫర్.. భారీగా ‘ఎక్స్‌ట్రా డేటా’.. గేమర్స్, యూత్‌కు పండగే!

Related News

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

9000mAh బ్యాటరీ.. ఏడేళ్ల అప్‌డేట్స్.. 2026లో బెస్ట్ మిడ్‌రేంజ్ ఫోన్ల లిస్ట్ వచ్చేసింది!

గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ రెండు కారణాలతో Pixel 10 ధర భారీగా పతనం!

Big Stories

Advertisement
×