Haier 237 L bottom mounted fridge: మనం రోజూ వాడే ఫ్రిజ్‌లలో ఎక్కువ శాతం ఫ్రీజర్ పైన, కూరగాయల బాక్స్ కింద ఉంటాయి. దీని వల్ల ప్రతి సారీ పాలు, పెరుగు లేదా కూరగాయలు తీయాలన్నా వంగాల్సి వస్తుంది. ఈ ఇబ్బందికి గుడ్ బై చెప్తూ హయర్ కంపెనీ ఒక సూపర్ ట్రెండీ ఫ్రిజ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే Haier 237 L Frost Free Bottom Mounted Refrigerator. ఇందులో ఫ్రీజర్ కింద, మనం రోజూ వాడే సెక్షన్ పైన ఉంటుంది. ‘ఝుక్నా మత్’ అనే స్లోగన్‌తో వచ్చిన ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ మధ్యతరగతి కుటుంబాలకు, మోడ్రన్ కిచెన్స్‌కు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ఫీచర్లు, ధర , ఇది మీకు ఎందుకు బెస్ట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో కిచెన్ అప్లయన్సెస్ కేవలం.. వస్తువులను దాచుకోవడానికే కాదు. ఇంటికి ఒక లగ్జరీ లుక్ ఇవ్వడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. హయర్ 237 లీటర్ల 3-స్టార్ / 2-స్టార్ ఇన్వర్టర్ ఫ్రిజ్ అదే కేటగిరీకి చెందుతుంది. ఈ ఫ్రిజ్‌లోని బెస్ట్ ఫీచర్లు ఇవే..
1. బాటమ్ మౌంటెడ్ డిజైన్ (Bottom Mounted Design):
ఈ ఫ్రిజ్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని డిజైన్. మనం రోజూ వాడే కూరగాయలు, పండ్లు, పాలు వంటివి 70% పైభాగంలోనే.. ఉంటాయి. కాబట్టి రోజులో ఎన్ని సార్లు ఫ్రిజ్ తీసినా నడుము వంచాల్సిన అవసరం ఉండదు. కేవలం ఐస్ క్యూబ్స్ లేదా నాన్-వెజ్ దాచుకునే ఫ్రీజర్ మాత్రమే కింద ఉంటుంది.
2. 8-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్స్ (8-in-1 Convertible):
మీ ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు లేదా ఎక్కువ సామాన్లు దాచుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ ఫ్రిజ్ లోని ఫ్రీజర్‌ను కూడా నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. ఇందులో మొత్తం 8 రకాల కన్వర్టిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా కూలింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
3. ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ (Twin Inverter Technology):
ఈ ఫ్రిజ్‌లో కంప్రెసర్ ,ఫ్యాన్ మోటార్ రెండూ ఇన్వర్టర్ టెక్నాలజీతో పనిచేస్తాయి. దీని వల్ల హోమ్ ఇన్వర్టర్‌పై కూడా ఇది ఈజీగా రన్ అవుతుంది. కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది. అలాగే స్టెబిలైజర్ లేకపోయినా వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇది తట్టుకోగలదు.
Also Read: బట్టలు త్వరగా ఆరి పోవాలా? ఈ ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్ పై ఓ లుక్కేయండి
4. టర్బో ఐసింగ్ (Turbo Icing):
ఎండకాలంలో లేదా అర్జంట్‌గా కూల్ డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు కేవలం 49 నిమిషాల్లోనే ఐస్ తయారు చేసే పవర్‌ఫుల్ టర్బో ఐసింగ్ ఫీచర్ ఇందులో ఉంది.
ధర ?
మార్కెట్లో హయర్ 237 లీటర్ల బాటమ్ మౌంటెడ్ ఫ్రిజ్ ధర దాని వేరియంట్, కలర్ , స్టార్ రేటింగ్‌ను బట్టి రూ. 24,990 నుంచి రూ. 28,890 మధ్య అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా రిలయన్స్ డిజిటల్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో.. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. కంప్రెసర్ పై ఏకంగా 10 ఏళ్ల వారంటీ లభిస్తుంది.
3 నుంచి 4 గురు ఉన్న చిన్న , మీడియం ఫ్యామిలీస్‌కి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి పదే పదే వంగడం ఇష్టం లేని వారికి ఈ స్మార్ట్ బాటమ్ మౌంటెడ్ ఫ్రిజ్ ఒక వండర్‌ఫుల్ ఆప్షన్.