Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాన గండం పొంచివుంది. రానున్న నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడే సమయంలో కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు అవకాశం ఉంది.
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వివిధ చోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు ఉంటాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.