BigTV English

IND vs Eng 1st Odi: అదానీ కోసం..టీమిండియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్ రద్దు ?

IND vs Eng 1st Odi: అదానీ కోసం..టీమిండియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్ రద్దు ?

IND vs Eng 1st Odi:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కంటే ముందు… ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా రెండు సిరీస్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ ( England) వర్సెస్ టీమ్ ఇండియా ( Team India ) మధ్య మొదటగా 5 t20 మ్యాచ్ లు జరుగుతాయి. రేపటి నుంచి ఈ టి 20 సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఐదు టి20 మ్యాచ్ లు పూర్తయిన తర్వాత వెంటనే ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ కూడా జరగనుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… 3 వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది.


Also Read: Watch: ముసలోడే కానీ మహా ముదురు..ఈయన ముందు రోహిత్‌, కోహ్లీ పనికి రారు !

అయితే ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే… మొదటి వన్డే గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే మొదటి వన్డే పోస్ట్ పోన్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన జరగాల్సిన ఈ వన్డే మ్యాచ్ ( One Day)…. ఏడవ తేదీకి షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే మొదటి వన్డే ఫస్ట్ ఫోన్ కావడానికి ముఖ్య కారణం… భారత దేశంలో ఉన్న బడా వ్యాపారవేత్త అదాని అని తెలుస్తుంది.


బడా వ్యాపారవేత్త, అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ( Gautam Adani ) కుమారుడి పెళ్లి నేపథ్యంలో మొదటి వన్డే వాయిదా పడబోతుందట. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే… నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ( Vidarbha Cricket Association Stadium )లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే ఫిబ్రవరి ఆరవ తేదీన గౌతమ్ ఆదానికి కొడుకు పెళ్లి జరగబోతుందట. ఇప్పటికే.. నాగపూర్ లోని క్రికెట్ స్టేడియాన్ని గౌతమ్ ఆదాని బుక్ చేసుకున్నారట.

Also Read: RCB- IPL 2025: RCB కోసం.. మహా కుంభమేళాలో ఏం చేశారో చూడండి ?

అయితే ఈ విషయం తెలిసో తెలియక… టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డేను ఆ స్టేడియంలోనే ఫిక్స్ చేసింది ఐసీసీ. దీంతో… తనకు ఆరోజు గ్రౌండ్ కావాల్సిందేనని గౌతమ్ ఆదాని ( Gautam Adani ) పట్టు పడుతున్నారట. అంతేకాదు ఐసీసీ పెద్దలతో కూడా చర్చిస్తున్నారట. జై షా ( Jai Shah ) ప్రస్తుతం ఐసీసీ ( ICC ) చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో… ఆయనతోనే గౌతమ్ ఆదాని డీలింగ్ నడుస్తోందని సమాచారం. దీంతో టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే వాయిదా పడి ఫిబ్రవరి 7వ తేదీన జరగబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే గౌతమ్ ఆదానిలాంటి వ్యాపారస్తునికి భయపడి ఐసీసీ వెనక్కి తగ్గబోదని కొంతమంది చెప్తున్నారు. కావాలంటే మరొక స్టేడియాన్ని గౌతమ్ ఆదానికి ఇస్తారు కానీ…. నాగపూర్ లోని ( Nagpur) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ( Vidarbha Cricket Association Stadium ) లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే ఫిబ్రవరి 6వ తేదీన యధాతధంగా జరుగుతుందని చెబుతున్నారు.

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×