RCB- IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు లో ( Indian Premier League ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ను ( Royal Challengers Bangalore team ) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరొక జట్టుకు లేదన్న సంగతి తెలిసిందే. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team )… గత 17 సంవత్సరాలుగా… ఛాంపియన్ కాలేకపోయింది. ప్రతిసారి కప్పు నమదే అనడం.. చెత్తగా ఆడడం.. ఇంటి దారి పట్టడం జరుగుతుంది. ఒకే ఒకసారి ఫైనల్ కు మాత్రమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) చేరడం జరిగింది.
Also Read: Yograj Singh: పెళ్ళాలు ఎందుకు దండగా..? టీమిండియా ప్లేయర్లపై యోగరాజ్ ఫైర్!
అయితే రాయల్ చాలెంజర్స్ జట్టులో… విరాట్ కోహ్లీ (Virat Kohli ) ఉండటం కారణంగా ఆ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది అన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ తో పాటు అప్పట్లో ఎబి డెవిలియర్స్ ( AB de Villiers ) కూడా ప్రాతినిధ్యం వహించాడు. అయినప్పటికీ… ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ని ( IPL ) దక్కించుకోలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కోట్లు పెట్టి.. ఆటగాలను కొనుగోలు చేసిన ఆర్సిబి ( RCB)… పూర్ణిలో మాత్రం పెద్దగా రాణించడం లేదు.
అయితే ఇలాంటి నేపథ్యంలో ఆర్ సి బి ఎలాగైనా కప్పు కొట్టాలని… రకరకాల పూజలు చేస్తున్నారు ఆర్సిబి ( Royal Challengers Bangalore team ) ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే కుంభమేళాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ రచ్చ చేశారు. దాదాపు 144 సంవత్సరాల తర్వాత… ప్రయాగ్ లో కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మహా కుంభమేళా అని పేరు పెట్టారు. ఈ మహా కుంభమేళం జరుగుతున్న నేపథ్యంలో ఆ గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని అంటున్నారు.
Also Read: IND vs Eng T20i: ఎల్లుండి నుంచే ఇంగ్లాండ్, టీమిండియా టీ20 సిరీస్..టైమింగ్, ఫ్రీగా చూడాలంటే ?
అలాగే మంచి విజయాలు దక్కుతాయని చెబుతున్నారు పండితులు. ఈ నేపథ్యంలోనే… ఆర్సిబి 2025 టోర్నమెంట్ ఛాంపియన్ కావాలని… కొంతమంది అభిమానులు కుంభమేళలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఒక అభిమాని అయితే…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన జెర్సీని… మహా కుంభమేళాలో ( Kumbh Mela 2025 )… ముంచి… కప్పు కొట్టాలని పూజలు చేశాడు. మహా కుంభమేళాల దగ్గర ఉన్న గంగలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) జెర్సీకి ( RCB Jersy) అభిషేకం చేసి… ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహా కుంభమేళాలో ( Kumbh Mela 2025 ) జెర్సీకి ( RCB Jersy) అభిషేకం చేసిన అభిమానులు కర్ణాటకకు చెందిన వారని సమాచారం. అయితే..ఈ వీడియో చూసిన వారు వాళ్లు చేసిన పూజలు ఫలించాలని కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">