E-Paper
Advertisement

Suryakumar Yadav : ఐసీసీ టీ 20 హీరో…సూర్యా అవుతాడా? ‘మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ రేస్ లో స్కై

Suryakumar Yadav : ఐసీసీ టీ 20 హీరో…సూర్యా అవుతాడా? ‘మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ రేస్ లో స్కై
Advertisement

Suryakumar Yadav : ఐసీసీ 2021 నుంచి టీ 20 మ్యాచ్ ల్లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లకు ‘మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందిస్తుంది. 2021లో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. 2022 సూర్య కుమార్ యాదవ్ తీసుకున్నాడు. 2023లో కూడా  టీ20 మేటి ఆటగాళ్ల షార్ట్ లిస్టుకు ఎంపికయ్యాడు. నలుగురిలో ఒకడిగా నిలిచాడు.

సూర్యతో పాటు మార్క్‌ చాప్‌మన్‌ (న్యూజిలాండ్‌), సికందర్‌ రజా (జింబాబ్వే), అల్పేష్‌ రమ్‌జాని (ఉగాండా) అవార్డు కోసం పోటీపడుతున్నారు. 2023లో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్‌లో 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

Advertisement

 కివీస్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ 19 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు సాధించాడు, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా 11 ఇన్నింగ్స్‌ల్లో 515 పరుగులు చేయడమే కాదు, 17 వికెట్లు తీశాడు. ఉగాండా బౌలర్ అల్పేష్ గతేడాది 55 వికెట్లు తీశాడు.

వీరు నలుగురిలో పరుగుల పరంగా చూస్తే సూర్యకుమార్ యాదవ్ టాప్ లో ఉన్నాడు. కానీ ఆల్ రౌండర్ గా చూస్తే మాత్రం జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా కనిపిస్తున్నాడు. ఉంటే వీరిద్దరి మధ్యే నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంటుందని అంటున్నారు.

Advertisement

2022లో ఐసీసీ అవార్డు అందుకున్న సూర్య, 2023 లో కూడా అందుకుంటే వరుసగా రెండు సార్లు ఎంపికైన క్రికెటర్ గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు తన పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే టీ 20 తాత్కాలిక కెప్టెన్ గా ఆస్ట్రేలియాతో సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. సౌతాఫ్రికాలో సమం చేశాడు. సెలక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు.

కాకపోతే సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ లో కాలి మడమ గాయం తిరగబెట్టడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. టీ 20 ప్రపంచకప్ సమాయానికి జట్టులోకి వస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. అయితే అది ఐపీఎల్ లో ఆడే పరిస్థితిని బట్టి ఉంటుందని అంటున్నారు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×