BigTV English

Gujarat Titans Team : 2023 టైటిల్ గుజరాత్‌కేనా? గిల్ మళ్లీ అద్భుతం చేస్తాడా? జట్టు బలాబలాలేంటి?

Gujarat Titans Team : 2023 టైటిల్ గుజరాత్‌కేనా? గిల్ మళ్లీ అద్భుతం చేస్తాడా? జట్టు బలాబలాలేంటి?


Gujarat Titans Team : గుజరాత్ టైటన్స్ చిన్న జట్టేం కాదు. డిఫెండింగ్ చాంపియన్‌. అనూహ్యంగా 2022 టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈసారి అద్భుతమైన పర్ఫామెన్స్‌తో టైటిల్ గెలిచేందుకు రెడీగా ఉంది. ఈ సీజన్ లీగ్‌లో 14 మ్యాచులు ఆడితే అందులో 10 మ్యాచ్‌లు గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఆ లెవెల్ పర్ఫామెన్స్ చూసి భయపడని జట్లు లేవు. ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ… రెండో క్వాలిఫైయర్‌లో ఏకంగా ముంబై జట్టునే ఇంటికి పంపించింది గుజరాత్ టైటన్స్.

గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది శుభ్‌మన్ గిల్. టీమిండియాకు మరో విరాట్ కొహ్లీ దొరికేసినట్టేనని దిగ్గజ క్రికెటర్లందరూ ప్రశంసిస్తున్నారు. గిల్ ఆట చూసి ఫారెన్ ప్లేయర్లు కూడా ఫిదా అయ్యారు. ధోనీ, రోహిత్ శర్మ, కొహ్లీ స్థానాలను భర్తీ చేయగల ఆటగాడు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 800లకు పైగా పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ గుజరాత్ జట్టుకు అతిపెద్ద అసెట్.


గుజరాత్ జట్టు కూడా చెన్నైకి ధీటుగానే ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చే ఆటగాళ్లున్నారు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ తరువాత… గుజరాత్ జట్టుకు అతిపెద్ద బలం వృద్ధిమాన్ సాహా. ఈ ఇద్దరి ఓపెనింగ్ ఆల్రడీ సక్సెస్ అయింది. ఇక ఆ తరువాత క్రీజులోకి వచ్చే విజయ్ శంకర్, కెప్టెన్ హార్ధిక పాండ్యా మ్యాచ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లగలరు. మిడిల్ ఆర్డర్ చూసుకోడానికి రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్ ఆల్రడీ ఉన్నారు. సో, బ్యాటింగ్ పరంగా అందరూ అదరగొట్టే వాళ్లే.

ఇక బౌలింగ్ లోనూ గుజరాత్ టైటన్స్ అదుర్స్. పేస్ బౌలింగ్‌లో  మహమ్మద్ ష‌మీ అతి పెద్ద అసెట్. స్పిన్ బౌలింగ్‌లో సెన్సేషనల్ బౌలర్ ర‌షీద్‌ఖాన్‌కు తిరుగులేదు. పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌, స్పిన్స‌ర్ నూర్ అహ్మ‌ద్ కూడా కీలక సమయంలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మ్యాచులలో మాత్రమే ఓడింది గుజరాత్ జట్టు. సో, పాండ్యా సేనను ఓడించడం అంత ఈజీ కాదు. 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×